AP POLITICS COMPETITION IN TDP FOR CONSTITUENCY IN CHARGE POST AS LEADERS LOBBYING AT CHANDRABABU AND LOKESH FULL DETAILS HERE PRN
TDP: టీడీపీలో ఆ పదవులకు తీవ్రపోటీ.. తెలుగు తమ్ముళ్లలో జోరుగా చర్చ.. కారణం ఇదేనా..!
లోకేష్, చంద్రబాబు (ఫైల్)
2019 ఎన్నికల్లో (2019 Assembly Elections) టీడీపీ (TDP)కి తగిలిన షాక్ అంతా ఇంతా కాదు. పార్టీ చరిత్రలోనే దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉండి అంతటి ఘోరపరాజయం ఎదుర్కోవడం అంటే పార్టీ దాదాపు కుదేలైనట్లే. ఆ తర్వాత రాష్ట్రంలో టీడీపీలో నిస్తేజం కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
2019 ఎన్నికల్లో (2019 Assembly Elections) టీడీపీ (TDP)కి తగిలిన షాక్ అంతా ఇంతా కాదు. పార్టీ చరిత్రలోనే దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అధికారంలో ఉండి అంతటి ఘోరపరాజయం ఎదుర్కోవడం అంటే పార్టీ దాదాపు కుదేలైనట్లే. ఆ తర్వాత రాష్ట్రంలో టీడీపీలో నిస్తేజం కనిపించింది. మూడేళ్ల పాటు పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. అసలు వాళ్లు పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానం కూడా కలిగింది. వైసీపీ ప్రభుత్వం తమ ఆర్ధిక మూలాలపై దెబ్బకొట్టడం, కేసుల భయంతో అంతా మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పొచ్చింది. గత నెలలో ప్రకాశం జిల్లాలో నిర్వహించిన మహానాడు విజయవంతం కావడం, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వినిపిస్తుండటంతో టీడీపీ నేతలు మళ్లీ యాక్టీవ్ అవుతున్నారు.
ఐతే ఈ పరిస్థితిలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం. అందకే గత మూడేళ్లుగా పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి ఇస్తామంటే వద్దుబాబోయ్ అని పారిపోయిన నేతలు.. ఇప్పుడు అదే పోస్ట్ కోసం పోటీపడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ ఇన్ ఛార్జ్ పదవంటే ఖర్చు చేయాలి, కేసులు ఎదుర్కోవాలి, కార్యకర్తలను కాపాడుకోవాలి అనే సాకులు చెప్పిన నేతలు.., ఇప్పుడు ముందుగానే కర్చీఫ్ వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 30 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ ఛార్జులు లేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన కొద్దిరోజులకే పరిస్థితిలో మార్పొచ్చిందట. ఇప్పుడు దాదాపు 40 నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. కొందరు చంద్రబాబు దగ్గరికెళ్తే.. మరికొందరు చినబాబుతో మంతనాలు సాగిస్తున్నారట. ఈ లిస్టులో ముఖ్యంగా సీనియర్ నేతల వారసులే ఉన్నారట. ఇకపై ఖర్చుకు వెనకాడేది లేదని, కేసులకు భయపడే ప్రసక్తే లేదని సదరు నేతలు పార్టీ అధిష్టానానికి చెబుతున్నారట. అంతేకాదు యువనేతలైతే సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే అధిష్టానం దృష్టిలో పడేందుకు ట్రై చేస్తున్నారట.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, విజయవాడ, కృష్ణా, గోదావరి జిల్లాలు, రాజమండ్రి, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ పదవికి పోటీ నెలకొంది. పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే కాకుండా.. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. అధికారంలో ఉంటామనే భావనతో ఇన్ ఛార్జ్ పోస్ట్ కు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మరి చంద్రబాబు, చినబాబును మెప్పించి ఇన్ ఛార్జ్ స్థానాన్ని దక్కించుకనే నేతలు ఎంతమందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీకి అంత సీన్ లేదని.. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవికి నేతల పోటీ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని వైసీపీ నేతలంటున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.