హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Actor Sunil: భీమవరం బుల్లోడు లెక్కలు మారుస్తాడా..? సునీల్ ను రానంటున్నా.. రంగంలోకి దింపుతారా..? ఆ పార్టీ ముమ్మర యత్నం

Actor Sunil: భీమవరం బుల్లోడు లెక్కలు మారుస్తాడా..? సునీల్ ను రానంటున్నా.. రంగంలోకి దింపుతారా..? ఆ పార్టీ ముమ్మర యత్నం

Actor Sunil: హీరో కం.. స్టార్ కమెడియన్ సునిల్.. మాటలకు అర్థాలే వేరా..? చిరంజీవి, పవన్ కళ్యాణ్ కోసం ఏమైనా చేస్తాను అంటున్నారు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేది లేదంటున్నారు..? కానీ జనసైనికులు మాత్రం ఆయనా మాకు కావాలని పట్టు పడుతున్నారా..? అందుకే ఆ పార్టీ ఆయన్ను రంగంలోకి దింపేందుకు ముహూర్తం సిద్ధం చేసిందా..?

ఇంకా చదవండి ...

  Actor Sunil: హీరో కం కమెడియన్ సునీల్ (Sunil).. మెగాస్టార్ చిరంజీవి (MegastarChiranjeevi) కి వీరాభిమాని. అంతే కాదు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నా ప్రాణం ఇష్తాను అనే రేంజ్ అభిమానం.. మరోవైపు 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా జనసేన (Janasena) అధినేత పవన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలపైనే ఆయన ఫోకస్ చేస్తున్నారు. అయితే భీమవరంలో ఇతర పార్టీ ఓటు బ్యాంకుతో సంబంధం లేకుండా నెగ్గాలి అంటే.. స్థానిక కార్యకర్తలు డిమాండ్ మేరకు అభ్యర్థిని ప్రకటించాలి.. అయితే అక్కడి జనసైనికులు చేస్తున్న డిమాండ్ ఏంటంటే.. యాక్టర్ సునీల్ ను బరిలో దింపితే కచ్చితంగా గెలిపించి తీరుతామంటున్నారు. దీంతో జనసేన అధినేత సైతం ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. పవన్ మనసులో అదే ఉందని.. ఒకవేళ సనులీ కు ఇష్టం లేకపోయినా..త్రివిక్రమ్ శ్రీనివాస్ చెబితే కాదు అనే అవకాశం ఉండదు. అందుకే ఏపీలో పొత్తులపై క్లారిటీ వచ్చిన తరువాత.. భీమవరం జనసేనకు వస్తే.. సునీల్ తో పోటీ చేయించాలనే ఆలోచనలో అధినేత పవన్ ఉన్నట్టు సమాచారం..

  ప్రస్తుతానికి సునీల్ ఈ పోటీపై అంత ఆసక్తి చూపించడం లేదు. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి సునీల్ మద్దతిచ్చాడు.. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్డడంతో గత ఎన్నికల్లోనే సునీల్ పోటీ చేస్తాడంటూ ప్రచారం జరిగిన.. అప్పుడు సునీల్ పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. మరి ఈ సారి సునిల్ ను పవన్ ఒప్పించే ప్రయత్నం చేస్తారా..? ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతోనే పవన్ ముందుకు వెళ్తున్నారు. ఆవిర్భావ సభలోనే ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని ఒోడించేందుకు అవసరమైతే.. పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధం అనే సంకేతాలు ఇచ్చారు..

  ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వంట నూనెల ధరలకు సర్కార్‌ బ్రేక్‌..!

  ఇలా కచ్చితంగా ఒక లక్ష్యంతో పవన్ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు త‌న స్ట్రాట‌జీ మార్చుతున్నారు. ఇందులో భాగంగా గెలిచేందుకు అవకాశం ఎవరికి ఉంది అన్నది బేరీజు వేసుకున్న తారువాతే అభ్యర్థులను ఆయన ప్రకటించనున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన తప్పిదాల‌ను మ‌ళ్లీ చేయ‌కుండా ఉండేందుకు ఆ పున‌రావృతిని నివారించేందుకు ఈ సారి ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. అందుకే భీమవరంలో సునీల్ ను నిలబెడితే.. కచ్చితంగా గెలుస్తాడని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. వారి డిమాండ్ మేరకు సునీల్ ఒప్పించే అవకాశం లేకపోలేదు.. అవసరమైతే సునీల్ రూం మేట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒప్పించే అవకాశం లేకపోలేదు.

  ఇదీ చదవండి : డైరెక్టర్ పై అభిమానంతో 50 రోజులు కష్టపడ్డ హీరో.. ఏం గిఫ్ట్ ఇచ్చాడో చూడండి

  ముఖ్యంగా ఎప్ప‌టి నుంచో రాష్ట్ర రాజ‌కీయాలకు సంబంధించి ముఖ చిత్రం మార్చాల‌ని, కాపులు, ఇతర బీసీల ప్రాధాన్యం రాజ‌కీయంలో పెరగాల‌ని ఓ వాదన అయితే వినిపిస్తోంది.  ఇవన్నీ పవన్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదని పవన్ సైతం భావిస్తున్నాడు.. అందుకే గెలుపు గుర్రాలను గుర్తించి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Comedian Sunil, Janasena, Powe star pawan kalyan, Sunil

  ఉత్తమ కథలు