హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jaganని ఓ రేంజ్‌లో పొగిడిన అలీ.. రాజ్యసభ మిస్ అయినా.. తగ్గేదేలేదంటున్న యాక్టర్

YS Jaganని ఓ రేంజ్‌లో పొగిడిన అలీ.. రాజ్యసభ మిస్ అయినా.. తగ్గేదేలేదంటున్న యాక్టర్

సీఎం జగన్ తో నటుడు ఆలీ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ తో నటుడు ఆలీ (ఫైల్ ఫోటో)

స్టార్ కమెడియన్ అలీ (Comedian Ali) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM Jagan) పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పాలన ఏపీలో కనిపిస్తుందని.. అద్భుత పాలనకు జనం మళ్లీ జగన్‌కే పట్టం కడతారంటూ ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తారు.

ఇంకా చదవండి ...

స్టార్ కమెడియన్ అలీ (Comedian Ali) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM Jagan) పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పాలన ఏపీలో కనిపిస్తుందని.. అద్భుత పాలనకు జనం మళ్లీ జగన్‌కే పట్టం కడతారంటూ ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తారు. రాజమండ్రికి చెందిన అలీ.. 2019వ సంవత్సరంలో వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం కూడా చేశారు. జగన్ అధికారంలోకి రావడానికి అలీ కూడా తనవంతు కృషి చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా (Australia) లోని మెల్‌బోర్న్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రవాసాంధ్రుల మహాగర్జనలో అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. త్వరలో జరిగే ప్లీనరీ నేపథ్యంలో అలీ ఆస్ట్రేలియా పర్యటన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ అభిమానులు తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే అధికారమని.. రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని ధీమా వ్యక్తం చేశారు.

ఇది చదవండి: ఆ జిల్లా నేతలతో వైసీపీకి తప్పని టెన్షన్.. ఆశలు వదులుకోవాల్సిందేనా..?


ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో అలీకి చనువు ఉన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అందరూ అలీకి అవకాశం ఇస్తారని అనుకున్నా.. ఆ లిస్ట్‌లో అలీ పేరు లేకపోవడం కొందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో ఓ సారి జగన్‌ని కలిసి వచ్చిన తర్వాత అలీ కూడా ఓ సందర్భంలో తన పదవిపై మాట్లాడారు. అయితే, జాబితాలో తన పేరు లేకపోవడాన్ని అలీ సమర్థించుకున్నారు. ఎవరికి ఎప్పుడు ఏం ఇవ్వాలో జగన్‌కు బాగా తెలుసని.. పార్టీతో సానుకూలంగా ఉంటూ, వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఇది చదవండి: త్వ‌ర‌లో ఢిల్లీకి ప‌వ‌న్..? మోదీ, షాతో తాడో పేడో తేల్చుకోనున్న జనసేనాని..?


వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో పనిచేస్తున్న ఆలీ.. అందులో భాగంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైసీపీ ప్లీనరీకి సన్నాహకంగా విదేశాల్లో జరుగుతున్న మహాగర్జన ప్రొగ్రాంకు హాజరవడమే కాకుండా.. ఎన్నారై కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారాయన. వచ్చే ఎన్నికల్లో ఆలీ ఖచ్చితంగా బరిలో దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందర్ని తప్పిస్తారని చర్చ జరుగుతున్నందన ఆయా స్థానాల్లో తనకు కలిసొచ్చే సీటును ఆలీ ఎంచుకునే అవకాశముంది. గతంలోనే గుంటూరు లేదా రాజమండ్రిలో ఆయన పోటీ చేయాలని భావించారు.

First published:

Tags: Ali, Andhra Pradesh, Ysrcp

ఉత్తమ కథలు