Comedian Ali Gift:
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం అవసరం లేని పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు అలీ. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు సీనియర్ కమెడియన్ గా.. స్టార్ హీరో రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమలో సుదీర్ఘకాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న నటుల్లో అలీ కూడా ఒకరు. ప్రస్తుతం సిల్వర్ స్ర్కీన్‌పై కనిపిస్తూనే టీవీ షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్నారు ఆయన. కేవలం సీనిమాలకే పరిమితం కాకుండా..? రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అలీ పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీచేయకపోయినా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం బాగానే కృషిచేశారు. దీనికి గుర్తింపుగా .. జగన్ సీఎం కాగానే అలీకి ఓ కీలకమైన పదవి ఇస్తారనే టాక్ వచ్చింది. రాజ్యసభ అని కొన్నాళ్లు.. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవి అని మూడేళ్ల పాటు ప్రచారం జరిగిందే తప్ప పదవీ మాత్రం రాలేదు. అయితే ఆ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అలీకి ప్రభుత్వంలో చోటు కల్పించారు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించారు. రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. ఆయన జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించి మరోసారి ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. గవర్నమెంట్ అడ్వైజర్లకు దాదాపు 3లక్షల వరకు వేతనం ఉంటుంది. అదనంగా కొన్ని అలవెన్సులు అందుతాయి. మరి అలీ విషయంలో అవే రూల్స్ ను కొనసాగిస్తారా.. లేక అదనపు ప్రయోజనాలు కల్పిస్తారా అన్నది చూడాలి.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహా దరుడిగా తనను నియమించినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలీ. ఈ పదవిని ఫుల్ ఫిల్ చేస్తానంటూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తన కూతురు పెళ్లి సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన గిఫ్ట్ గా దీన్ని భావిస్తున్నామన్నారు. తాను వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే జగన్‌కు తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాను అన్నారు. పదవుల కోసం పార్టీలోకి రాలేదన్న విషయం ఆయనకు తెలిపాను అన్నారు. అయితే తన పదవికి సంబంధించి గతంలో మీడియాల్లో పలు రకాల వార్తా కథనాలు వచ్చాయి. దీనిపై తాను కూడా క్లారిటీ ఇచ్చాను అన్నారు.
ఇదీ చదవండి : భూతల స్వర్గంలా ఆకట్టుకుంటున్న కొత్త పర్యాటక ప్రాంతం.. చేతులను ముద్దాడేలా మేఘాలు
తన గురించి జగన్ కు పూర్తిగా తెలుసు అన్నారు. అందుకు నిదర్శనమే ఈ పదవి అని.. ఇది తన కూతురి పెళ్లికి జగన్ ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాను అంటూ అలీ ఎమోషన్ అయ్యారు. అలీ సతీమణి జుబేదా కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhra Pradesh, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, AP News