Home /News /andhra-pradesh /

AP POLITICS COCK FIGHT AT HYDERABAD SURROUNDIGS 21 MEMBERS ARRESTED ASCPED CHINTAMANENI PRABHKAR AND KRISHNAM RAJU NGS

Cock Fight: హైదరాబాద్ శివార్లలో కోడిపందాలు.. 21మంది అరెస్ట్.. పరారీలో చింతమనేని, కృష్ణంరాజు..!

కోడిపందాలు ఆడుతూ 21 మంది అరెస్ట్.. పరారీలో చింతమనేని,

కోడిపందాలు ఆడుతూ 21 మంది అరెస్ట్.. పరారీలో చింతమనేని,

Cock Fight: హైదరాబాద్ లో కోడిపందాలు కలకలం రేపాయి. రాజకీయ నేతలు, ఇతర ప్రముఖల ఆధ్వర్యంలోనే ఈ కోడిపందాలు జరిగినట్టు తెలుస్తోంది. 21 మందిని అరెస్ట్ చేయగా.. 49 మంది తప్పించుకున్నట్టు సమాచారం. వారిలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Cock Fight:  హైదరాబాద్ (Hyderabad) శివార్లలో కోడి పందాలు (Cock Fight) కలకలం రేపాయి.  చాలా రోజులగా గుట్టు చప్పుడు కాకుండా అక్కడ కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు  పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైద‌రాబాద్ పోలీసులు నిఘా వేసి పందెం రాయుళ్లు కొందర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే మొత్తం 70 మందితో క‌లిసి పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందేలు నిర్వ‌హిస్తుంటే క‌చ్చిత‌మైన స‌మాచారంతో పోలీసులు దాడులు నిర్వ‌హించారు. అప్పటికే జోరుగా కోడిపందాలు జరుగుతున్నాయి.. కానీ పోలీసులు వచ్చారని తెలియడంతో.. 49 మంది అక్కడ నుంచి పరారయ్యారు. మిగిలిన  21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే ఈ పందాల ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (EX MLA Chintamaneni Prabhkar) గా గుర్తించినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు నిర్వాహకులు అక్కినేని సతీష్,  బర్ల శ్రీనులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.  కానీ  అప్పటికే పోలీసులు వచ్చారని  తెలియడంతో చింతమనేని ప్రభాకర్  , కృష్ణంరాజు (Krishnam Raju) పరారి అయ్యారని పట్టుబడ్డ వారు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పందాల కోసం లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్టు తెలుసుకున్నారు.

    పరారైన వారికోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. కాగా, పోలీసులను చూసి చింతమనేని పరారైన‌ట్టు తెలుస్తోంది. పటాన్ చెరు డీఎస్పీ భీం రెడ్డి ఆధ్వ‌ర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలో నిందితుల నుంచి భారీగా నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.



    పెదకంజర్ల గ్రామంలోని ఓ తోటలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వ‌హిస్తున్నట్టు ఆలస్యంగా  పోలీసులు గుర్తించారు.  స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం..  గత కోంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేత చింతమనేని కోడిపందాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు.

    ఇదీ చదవండి : ఆ ఇద్దరి లెక్క తేల్చేస్తారా..? లోకేష్ సైలెంట్ ఆపరేషన్ మొదలెట్టారా..?

    పోలీసుల దాడిలో నిందితుల నుంచి 13.12ల‌క్ష‌ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 21మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి చెందిన 26 వాహనాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 32 పందెం కోళ్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఇదీ చదవండి : చాలాకాలం తరువాత జగన్ వెంట వైఎస్ విజయమ్మ.. ప్లీన‌రీ తరువాత రాజీనామా చేస్తారా?

    సాధారణంగా కోడి పందాలు అంటే ఏపీలోనే ఎక్కువగా జరుగుతాయి. ముక్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. అది కూడా సంక్రాతి సమయంలో మాత్రమే..  ఎంత నిఘా పెట్టినా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కోడిపందాలు మాత్రం ఆగవు. ఇప్పుడు సమయం సందర్భం కాని వేళలో.. హైదరాబాద్ కు గేమ్ ను షిఫ్ట్ చేశారు.. అయితే అది కూడా రాజకీయ నేతలే ఈ కోడి పందాలను దగ్గరుండి నిర్వహిస్తుండడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీసింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chintamaneni prabhakar, Cock fight, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు