ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys Jagan) కడప పర్యటన రద్దు అయింది. నేడు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప (Kadapa)కు బయలుదేరి వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. కడప (Kadapa) ఎయిర్ పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాలేదు. అయితే జగన్ కొంతసేపు ఎదురు చూశారు. అయినా కానీ ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోవడంతో జగన్ (Ys Jagan) కడప (Kadapa) పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే రేపు అమీన్ పీర్ దర్గా వద్ద ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో నేడు సీఎం జగన్ (Ys Jagan) దర్గాకు వెళ్లి చాదర్ ను సమర్పించడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో జగన్ (Ys Jagan) పర్యటన రద్దయింది.
‘జయహో బీసీ మహాసభ’ కార్యక్రమం..
మరోవైపు ఏపీ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఇతర పార్టీలతో పోలిస్తే.. అధికార వైసీపీ (YCP) మరింత దూకుడుగా ఉంది. గెలుపు కావాల్సిన అన్ని వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు జగన్ (Jagan).. కొత్త కొత్త అస్త్రాలను సంధిస్తున్నారు. ఇప్పుడు మరో భారీ స్కెచ్ తో సిద్ధమయ్యారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలి అంటే.. బీసీ ఓట్లు చాలా కీలకం.. అందుకే బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపు భారీ ఎత్తున జయహో బీసీ మహాసభ నిర్వహిస్తున్నారు. అయితే అధికార వైసీపీ.. మాత్రం బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటోంది. ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’ కార కార్యక్రమాన్ని బుధవారం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ (YSRCP) అనుబంధ విభాగాల ఇన్చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు తదితరలు పరిశీలించారు.
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 7న జరగనున్న జయహో బీసీ మహాసభను జయప్రదం చేయాలని ఆయన బీసీలను కోరారు. ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సభ తరువాత జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap, Ap cm jagan, AP News