Home /News /andhra-pradesh /

AP POLITICS CM YS JAGAN SLAMS CHANDRABABU AND PAWAN KALYAN FOR CRITICIZING GOVERNMENT FULL DETAILS HERE PRN

YS Jagan: 'నా వెంటుక్ర కూడా పీకలేరు..' బాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్..

సీఎం వైఎస్ జగన్

సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నంద్యాలలో జగనన్న వసతిదీవెన (Jagananna Vasath Deevena) రెండో విడత నగదును విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నంద్యాలలో జగనన్న వసతిదీవెన (Jagananna Vasath Deevena) రెండో విడత నగదును విడుదల చేసిన జగన్.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు టీడీపీకి. చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు కనిపించవని విమర్శించిన జగన్.. ఢిల్లీలో కూడా రాష్ట్ర పరువును తీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఉందని.., డిల్లీ లెవల్లో మన రాష్ట్ర పరువును తాకట్టు పెడుతుందన్నారు. వైఎస్ జగన్ అనే నేను.. దేవుని దయ.. ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని.. ప్రజల దీవెనలు ఉన్నంత వరకు వీరంతా నా వెంట్రుక కూడా పీకలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  అంతేకాదు ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందులేదన్న జగన్.. ఇలాగే చేస్తే గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారంటూ ఎద్దేవా చేశారు. పిల్లల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా కుట్రలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కంటే తమ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచామని జగన్ గుర్తుచేశారు. ఒక మేనమామగా పిల్లలను చదివిస్తుంటే.. చిక్కీ కవర్లపై సీఎం బొమ్మ ఉందంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  ఇది చదవండి: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?


  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాచత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. పేదరికం కారణంగా చదువులు ఆగిపోకూడదని అన్నారు. పేదలను చదవించే బాధ్యతను కుటుంబ పెద్దగా తాను తీసుకున్నానన్న జగన్.. వసతి దీవెన ద్వారా పేద కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. చదవు అనేది తల్లిదండ్రులకు ఆర్ధిక బారం కాకుండా చేయాలనేదే తమ ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు..


  పేద విద్యార్థుల చదువు కోసం వైఎస్ఆర్ పూర్తి రీయింబర్స్ మెంట్ ఇస్తే.. తాను రెండు అడుగులు ముందుకేసి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగారిస్తే.. తాము మరిన్ని మెరుగులుదిద్ది అమలు చేస్తామని జగన్ వెల్లడించారు. కాలేజీల్లో సౌకర్యాలు గురించి తల్లులకు ప్రశ్నించే హక్కు వస్తుందని.. తద్వారా వసతులు పెరుగుతాయన్నారు. కాలేజీల్లో సౌకర్యాలు లేకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు జగన్. పిల్లలకు చదువుతో పాటు మంచి భోజనం కూడా అందిస్తున్నామని.. బైలింగువల్ బుక్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియంను క్రమంగా వారికి అలవాటు చేస్తున్నట్లు వివరించారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kurnool

  తదుపరి వార్తలు