హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సీఎం జగన్‌ను డైలమాలో పడేసిన ఆ నలుగురు మంత్రులు ?

YS Jagan: సీఎం జగన్‌ను డైలమాలో పడేసిన ఆ నలుగురు మంత్రులు ?

Andhra Pradesh: మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. రెండు జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులను తొలగించే విషయంలో మాత్రం సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది.

Andhra Pradesh: మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. రెండు జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులను తొలగించే విషయంలో మాత్రం సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది.

Andhra Pradesh: మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. రెండు జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులను తొలగించే విషయంలో మాత్రం సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది.

  ఏపీలోని మంత్రులంతా రాజీనామాలు చేసి మాజీ మంత్రులయ్యారు. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, సీనియారిటీ ప్రకారం కొంతమంది కొత్త మంత్రులకు అవకాశం ఇవ్వాలని యోచనలో సీఎం జగన్ (YS Jagan) ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా సీఎం జగన్ కొనసాగించే వారి జాబితాలో వీరు ఉండొచ్చంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరి విషయంలో సీఎం జగన్ ఇంకా ఓ తుది నిర్ణయానికి రాలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. రెండు జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులను తొలగించే విషయంలో మాత్రం సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఆ నలుగురు మరెవరో కాదు.. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని(Kodali Nani), పేర్నినాని(Perni Nani), ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్. ఏపీలో జిల్లాల పునర్విభజన తరువాత కూడా ఈ మంత్రులు ఒకే జిల్లాలో ఉండిపోయారు.

  కృష్ణా జిల్లాలో కొనసాగిన గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాలకు కొడాలి నాని, పేర్ని నాని ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలోనే ఉన్న ఒంగోలు, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు బాలినేని శ్రీనిసవారెడ్డి, ఆదిమూలపు సురేశ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు జగన్ కొందరు మంత్రులను కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నానిని కొనసాగిస్తే.. పేర్ని నానిని కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఉంటుందనే వాదన ఉంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన కొడాలి నానిని కొనసాగిస్తే.. కాపు సామాజికవర్గానికి చెందిన పేర్ని నానికి కూడా కొనసాగించ తప్పన పరిస్థితి ఉంటుంది.

  ఒకరిని కొనసాగించి.. మరొకరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే.. ఏదో ఒక సామాజికవర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చు. అందులోనూ చంద్రబాబును టార్గెట్ చేసే విషయంలో మంత్రి కొడాలి నాని దూకుడుగా వ్యవహరిస్తే.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే విషయంలో పేర్ని నాని ముందుంటారు. అదే సమయంలో సీనియర్, తనకు సమీప బంధువు అయినబాలినేని శ్రీనివాస రెడ్డిని కొనసాగిస్తే.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది.

  AP Cabinet Updates: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?

  AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే.. హోర్డింగులకూ విద్యుత్ బంద్.. మాల్స్ పైనా ఆంక్షలు..

  లేకపోతే రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన ఎస్సీ వర్గానికి చెందిన మంత్రిని తొలగించారనే అపవాదు రావొచ్చు. ఈ కారణంగా కొడాలి నాని లేదా పేర్ని నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా అయితే జిల్లాల విభజన తరువాత కూడా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చే వీరిని మంత్రులుగా కొనసాగించడం వల్ల లేనిపోని విమర్శలు వస్తాయనే వాదన కూడా ఉంది. దీంతో ఈ నలుగురు మంత్రులు విషయంలో సీఎం జగన్ ఎటూ తేల్చుకోలేని సంకటస్థితిలో పడిపోయారనే చర్చ జరుగుతోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు