హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: 'భజనలు బస్సులకే వందల కోట్లు.. ఆ మాట మోదీ బెడ్ రూమ్లోకి వెళ్లి విన్నారా..?' బాబుపై జగన్ సెటైర్లు..

YS Jagan: 'భజనలు బస్సులకే వందల కోట్లు.. ఆ మాట మోదీ బెడ్ రూమ్లోకి వెళ్లి విన్నారా..?' బాబుపై జగన్ సెటైర్లు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య వార్ కొనసాగుతోంది. టీడీపీ కల్తీ మద్యం అంశాన్ని లేవనెత్తుతుంటే.. వైసీపీ పెగాసస్ ఇష్యూతో ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ (AP Assembly) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) మధ్య వార్ కొనసాగుతోంది. టీడీపీ కల్తీ మద్యం అంశాన్ని లేవనెత్తుతుంటే.. వైసీపీ పెగాసస్ ఇష్యూతో ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యలో ఇతర ముఖ్యమైన అంశాలపైనా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. కానీ చంద్రబాబును అభిమానించే మీడియా మాత్రం అసత్య ప్రచారాలు చేస్తోందని జగన్ మండిపడ్డారు. తాము చేయలేని పనిని మరొకరు చేస్తున్నారనే కడుపు మంటతో రోజుకో కథనాన్ని ప్రసారం చేస్తున్నారని ఆయన అన్నారు. సొంత జిల్లాలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని విమర్శించారు.

  వాస్తవాలు ఎలా ఉన్నా..మసిపూసి మారేడు కాయ చేస్తున్నారన్న జగన్.. చంద్రబాబు పనులు పోలవరానికి శాపంగా మారాయని ఆరోపించారు. ప్లానింగ్ లేకుండా చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించారని.. దీని వల్ల రాష్ట్ర ఖజానకు చిల్లుపడినట్లేనన్నారు. పోలవరం కాఫర్ డ్యాంకు కూడా చంద్రబాబు చిల్లులు పెట్టారని.. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా..పనుల్లో విపరీతమైన జాప్యం జరిగిందని జగన్ ఆరోపించారు.

  ఇది చదవండి: సీఎంను ఇప్పటివరకు ఎవరూ ఇలా పోల్చలేదు.. జగన్ పై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు

  స్పిల్ వే నిర్మాణంలో చంద్రబాబు తప్పులు చేశారన్న జగన్.. రెండు కాఫర్ డ్యాంల మధ్యలో మెయిన్ డ్యాం కట్టాలకానీ.. మధ్యలో 3 పెద్ద పెద్ద ఖాళీలు వదిలి పెట్టారన్నారు. అలాగే ప్రాజెక్టు డిజైన్ ప్రకారం నీటిని కుడి వైపుకు మళ్లించాలని.. నీటిని మళ్లించడానికి ముందే స్పిల్ వే పెట్టాల్సి ఉందని.. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం కట్టారని జగన్ ఆరోపించారు.

  ఇది చదవండి: ఆ విషయంలో పెద్దిరెడ్డిని ఢీ కొడుతున్న రోజా.. రేసులో గెలుస్తారా..?

  చంద్రబాబు ఓ విజనరీ అని తనకు తానుగా ముద్రవేసుకునే పెద్దమనిషి అని సీఎం ఎద్దేవా చేశారు. బాబు చేసిన పనులు వల్లే వర్షాలు, వదరలు వచ్చినప్పుడు పనులుకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. పునాది పైన, లోపల కలిపి 35.6 మీటరల్ లోతు గుంట ఏర్పడిందని.. డిజైన్స్ క్లియరెన్స్‌ పొంది దిగువ కాఫర్ డ్యాం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని జగన్ తెలిపారు.

  ఇది చదవండి: 13 జిల్లాలు 11వేల అభ్యంతరాలు.. కొత్త జిల్లాలపై ప్రజల స్పందన ఇదే..

  పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించిన జగన్.. పోలవరం ఎత్తు ఒక ఇంచ కూడా తగ్గించేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని హెచ్చరించారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కమీషన్ల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టు తీసుకున్నారని ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారని ఎవరు చెప్పారు? చంద్రబాబు ఏమైనా... మోదీ బెడ్ రూంలోకి..షెకావత్ బెడ్ రూంలోకి వెళ్లి విని వచ్చారా..? అని సెటైర్లు వేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు వందల కోట్లు ఖర్చు పెట్టి భజనలు చేయించుకున్నారని.. తిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే నా గొంతు నొక్కేశారని జగన్ గుర్తుచేశారు. 2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

  First published:

  Tags: AP Assembly, Ap cm ys jagan mohan reddy, Polavaram

  ఉత్తమ కథలు