హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ‘మీరు మానేస్తే.. మా వాళ్లు కూడా మానేస్తారు’.. టీడీపీకి సీఎం జగన్ కీలక సూచన..

YS Jagan: ‘మీరు మానేస్తే.. మా వాళ్లు కూడా మానేస్తారు’.. టీడీపీకి సీఎం జగన్ కీలక సూచన..

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

అచ్చెన్నాయుడు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

AP Assembly: సీఎం జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన, జోగి రమేశ్ అచ్చెన్నాయుడికి స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్వయంగా సీఎం జగన్ కల్పించుకుని అచ్చెన్నాయుడితో మాట్లాడారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో యథావిథిగా నిరసనలు కొనసాగాయి. అనంతరం జరిగిన ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశానికి టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తే తాము ఊరుకునేది లేదని మంత్రులు బుగ్గన, జోగి రమేశ్ అచ్చెన్నాయుడికి స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్వయంగా సీఎం జగన్ కల్పించుకుని అచ్చెన్నాయుడితో మాట్లాడారు. రాజకీయ నాయకులుగా మనం ఎన్నో అనుకుంటామని చెప్పారు. అయితే తాము కుటుంబాల జోలికి రావాలనుకోమని వ్యాఖ్యానించారు. ఒకవేళ మీరు కుటుంబాల జోలికి వస్తే మా సీఎం కుటుంబాన్ని అంటారా అని మా వాళ్లు అంటారని... అందుకే మీరు కుటుంబాల గురించి మాట్లాడటం మానేస్తే... మా వాళ్లు కూడా ఆటోమేటిక్‌గా మానేస్తారని టీడీపీ నేతలకు సూచించారు. సభలో మీరు లేవనెత్తబోయే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతామని సీఎం జగన్ అన్నారు. టీడీపీ, తాము లేవనెత్తబోయే ప్రశ్నలు దాదాపు ఒకటేనని అన్నారు. అన్ని విషయాలపై చర్చిద్దామని... మీకు కావాల్సినన్ని రోజులు సభ పెడదామని వారికి సూచించారు. టీడీపీ కోరితే రాజధానిపై, ఈఎస్ఐ స్కామ్ పై కూడా చర్చ జరుపుతామని స్పష్టం చేశారు.

నేడు అసెంబ్లీ ప్రారంభమైన అనంతరం టీడీపీ నిరసనలకు దిగడం సభ రెండుసార్లు వాయిదా పడింది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సభను ఐదు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో 17, 18 సెలవు రోజులు. మరోవైపు టీడీపీ ప్రతిపాదించిన 17 అంశాలపై చర్చించేందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు అసెంబ్లీ వాయిదా పడ్డ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్(YS Jagan) మంతనాలు సాగించారు. సభలో అనుసరించిన వ్యూహాలపై వారితో చర్చించారు.

అంతకుముందు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వెంటనే సభలో రచ్చ ప్రారంభమైంది. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్... ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడదామని చెప్పారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. జాబ్ లు ఇవ్వలేని సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ వారు నినదిస్తున్నారు. ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. టీడీపీ సభ్యులు కావాలనే సభలో రచ్చ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి రెడ్ లైన్ ను దాటారని అన్నారు. ప్లకార్డులు పట్టుకుని సభలోకి రావడం సరికాదని చెప్పారు.

Vijayawada: వాట్‌ యాన్‌ ఐడియా..! బుల్లెట్‌ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?

Minster Roja: నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం పని చేస్తున్నామని మంత్రి జోగి రమేశ్ చెప్పారు. ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. టీడీపీ సభ్యులకు సమస్యలపై చర్చించే దమ్ము లేదని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి జరగబోయేది శవయాత్రేనని ఆయన వ్యాఖ్యానించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kinjarapu Atchannaidu

ఉత్తమ కథలు