సీఎం వైఎస్ జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దయ్యింది. ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ఉప ఎన్నికల ప్రచార సభను సీఎం జగన్ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి కారణంగా తిరుపతి సభకు రాలేకపోతున్నానని అందులో పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే 2765 కరోనా కేసులు వచ్చాయని.. ఒక్క రోజులోనే చిత్తూరు 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయని లేఖలో తెలిపారు. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందారని అన్నారు. తాను తిరుపతి సభకు నేను హాజరైతే వేలాదిగా జనం తరలివస్తారని తెలిపారు. తనకు ప్రజల ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని.. అందుకే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి కలిగిన లబ్దికి సంబంధించిన వివరాలతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశానన్న ముఖ్యమంత్రి.. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా తాను తిరుపతి సభకు రాలేకపోతున్నానని అన్నారు. తాను చేసిన మంచికి ప్రజంలదరికీ చేరిందన్న నమ్మకం ఉందని.. అందరి దీవెనలను ఓట్ల రూపంలో ఇస్తారని భావిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని సీఎం జగన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.