మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరగనున్న భేటీలో ఏయే అంశాలు చర్చకు రానున్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని వైసీపీ వర్గాలు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నా... ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సమావేశంలో చిరంజీవి, జగన్ ఏం చర్చించుకుంటారనే అంశం పక్కనపెడితే... సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ కారణంగా మెగా అభిమానుల్లో చీలిక వచ్చే అవకాశం లేకపోలేదనే ప్రచారం మొదలైంది.
నిజానికి సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం కావడం మెగా అభిమానులకు... అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏ మాత్రం ఇష్టంలేదనే వాదన ఉంది. ఓ వైపు తమ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విధానాలపై పోరాడుతుంటే... చిరంజీవి సీఎం జగన్‌తో ఈ రకంగా ఎలా భేటీ అవుతారని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి సీఎం జగన్‌తో చిరంజీవి సమావేశం అనంతరం మెగా అభిమానులు, అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Chiranjeevi, Janasena, Pawan kalyan, Sye raa narasimhareddy, Vijayawada