హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP: విశాఖ నుంచి జగన్ సర్కార్ పరిపాలన.. ఎప్పటి నుంచో చెప్పిన ఏపీ మంత్రి

AP: విశాఖ నుంచి జగన్ సర్కార్ పరిపాలన.. ఎప్పటి నుంచో చెప్పిన ఏపీ మంత్రి

వైఎస్ జగన్

వైఎస్ జగన్

AP News: ఎప్పటి నుంచి పరిపాలన రాజధానిగా ఉండబోతున్న విశాఖ నుంచి పరిపాలన ఉంటుందనే విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఏపీలో కచ్చితంగా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని మరోసారి స్పష్టం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా మరోసారి తెలిపారు. అయితే ఎప్పటి నుంచి పరిపాలన రాజధానిగా ఉండబోతున్న విశాఖ నుంచి పరిపాలన ఉంటుందనే విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీడియా ప్రతినిధులతో మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ (Gudiwada Amarnath).. త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ (Visakhapatnam) నుంచే పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు. నిన్న మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్(CM YS Jagan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. అమరావతిలో రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబే కాదు ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని జగన్ తేల్చిచెప్పేశారు.

  అందుకే తాను విశాఖను రాజధానిగా ఎంచుకున్నట్లు జగన్ తెలిపారు. అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని జగన్ తెలిపారు. ప్రతీ ప్రాంతం బాగుపడాలి, ఆ ప్రాంతంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలనేదే తన తాపత్రయమన్నారు. ఆ ప్రాంతంపైనా, అక్కడి ప్రజలపైనా వ్యతిరేకత ఉండదన్నారు. అమరావతి విజయవాడకూ, గుంటూరుకూ దగ్గర లేదన్నారు. ఏ నగరానికీ దగ్గరలేని ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, నీరు కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ లేవన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి 2 లక్షల చొప్పున లక్షా 10 వేల కోట్లు అవుతుందని చంద్రబాబే లెక్కవేశారని, 8 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్ష కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉందన్నారు. ఐదేళ్లపాలనలో చంద్రబాబు దీనిపై ఎంత ఖర్చుపెట్టారో సభ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరముందన్నారు.

  రాజధానిపై ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి ఐదేళ్లలో 5674 కోట్లు ఖర్చుచేసి 2297 కోట్లు మాకు బకాయి పెట్టి వెళ్లిపోయారని జగన్ ఆరోపించారు. ఏ ప్రభుత్వం కూడా ఏడాదికిఇంతకన్నా ఎక్కువగా పెట్టలేని పరిస్ధితి ఉందన్నారు. అమరావతికి లక్షకోట్లు పెట్టాలంటే ఈ లెక్కన వందేళ్లు పడుతుందన్నారు. అమరావతిలో రాజధాని తీసేయడం లేదని స్పష్టం చేశారు.

  Kurnool అమరావతి నుంచి హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిందే..! చంద్రబాబుకు లాయర్ల హెచ్చరిక

  Vizag: ఇకపై విశాఖ రోడ్డు మీద ఇష్టమొచ్చినట్లు వెళ్తే దబిడిదిబిడే..! రంగంలోకి దిగిన సీపీ..!

  విశాఖ,కర్నూలుతోపాటు ఇక్కడా రాజధాని కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రమంటే అమరావతే కాదు రాష్ట్రమంటే అమరావతే కాదు రాష్ట్రమంటే 8 కిలోమీటర్ల పరిధి కలిగిన ప్రాంతం కాదని జగన్ తెలిపారు. ఈ క్రమంలో మరోసారి మూడు రాజధానులు తమ విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పరిపాలన చేపట్టే అవకాశం ఉందని మంత్రి అమర్నాథ్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Visakhapatnam

  ఉత్తమ కథలు