హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan Meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. కోనసీమపైనే ప్రధాన చర్చ..

Jagan Meets Governor: గవర్నర్ తో సీఎం జగన్ భేటీ.. కోనసీమపైనే ప్రధాన చర్చ..

గవర్నర్ తో సీఎం జగన్

గవర్నర్ తో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusah Hari Chandan) తో సీఎం జగన్ (AP CM YS Jagan) భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన.. దాదాపు గంటపాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusah Hari Chandan) తో సీఎం జగన్ (AP CM YS Jagan) భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన.. దాదాపు గంటపాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కోనసీమ జిల్లా వివాదం (Konaseema District Issue), మే 24న అమలాపురం (Amalapuram) లో చోటు చేసుకున్న విధ్వంసం వంటి అంశాలపై గవర్నర్ కు సీఎం జగన్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోనసీమలో జరిగిన అల్లర్లపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు గవర్నర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కోనసీమలో అల్లర్లకు గల కారణాలు, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లపై జరిగిన దాడులు, ఆ తర్వాతి పరిస్థితులు, అక్కడి విధ్వంసాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం జగన్.. గవర్నర్ కు వివరించినట్లు తెలుస్తోంది.

అలాగే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కొనసాగింపుపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అమలాపుంలో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..! దీంతో గవర్నర్ కూడా ఈ ఇష్యూపై దృష్టిపెట్టారు. సీఎం జగన్ దావోస్ టూర్ (CM Jagan Davos Tour) కు వెళ్లినప్పుడు ఈ ఘటనలు జరగడంతో నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి కోనసీమ ఘటనలపై వివరణ ఇచ్చారు. అలాగే దావోస్ టూర్ వివరాలు, రాష్ట్రానికి వచ్చే సంస్థలు, పెట్టుబడుల వివరాలను జగన్ వివరించినట్లు సమాచారం.

ఇది చదవండి: ఏపీ టెన్త్ ఫలితాల్లో విచిత్రం.. 11 మార్కులకే పాస్.., ప్రూఫ్ ఇదిగో..!


ఇదిలా ఉంటే త్వరలోనే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా చర్చ జరిగింది. ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ తేదీలు, సభలో ప్రవేశపెట్టే బిల్లులు, డిప్యూటీ స్పీకర్ ఎన్నికి తదితర అంశాలపై గవర్నర్ తో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటన అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.


ఈనెల 20 నుంచి అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై సర్వత్రా చర్చజరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై సీరియస్ గా దృష్టిపెట్టిన నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ ముందుకు చర్చకు వచ్చే అంశాల్లో క్యాపిటల్ టాపిక్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే పోలవరం అంశం, వ్యవసాయ సీజన్ కు సంబంధించిన బిల్లులు, సంక్షేమ పథకాలపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశముంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Governor

ఉత్తమ కథలు