హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan on Capitals: హైకోర్టు తన పరిధిని దాటింది.. రాజధానుల తీర్పుపై జగన్ సంచలన కామెంట్స్

Jagan on Capitals: హైకోర్టు తన పరిధిని దాటింది.. రాజధానుల తీర్పుపై జగన్ సంచలన కామెంట్స్

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)

మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానులపై కోర్టు తీర్పును ఆయన తప్పుబడ్డారు. ఏ వ్యవస్థ అయినా తన పరిధిలో ఉంటే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

  మూడు రాజధానుల అంశం (Three Capitals Issue) పై అసెంబ్లీ (AP Assembly) లో సీఎం జగన్ (AP CM YS Yagan) కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ఆయన తప్పుబడ్డారు. ఏ వ్యవస్థ అయినా తన పరిధిలో ఉంటే మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉందన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థకి గానీ, న్యాయవ్యవస్థకు గానీ చట్టాలు చేసే అధికారం లేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు ప్రభుత్వానికి నచ్చకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారన్నారు. గత ప్రభుత్వం విధానాలను ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే తమకు 86శాతం సీట్లు ఇచ్చారని జగన్ గుర్తుచేశారు. శాసన వ్యవస్థలో కోర్టులు రాకూడదని.. కోర్టులు సాధ్యం కాని గడువులు విధించకూడదన్నారు. నెలరోజుల్లోగా లక్ష కోట్లు ఖర్చు చేసి అన్నీ నిర్మించాలని.. ఆరు నెలల్లో 5 లక్షల కోట్లతో రాజధాని నిర్మించాలనడం సరికాదన్నారు.

  గౌరవ సభ ద్వారా ఒక బాధ్యతతో కొన్ని విషయాలను సభ ముందు ఉంచుతున్నానన్న జగన్.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని శ్రీకృష్ణకమిటీ చెప్పిన విషయాలను జగన్ గుర్తు చేశారు. అలాగే వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని శివవరామకృష్ణన్ కమిటీ చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మూడు రాజధానుల బిల్లులో కూడా అదే ప్రస్తావించామన్నారు. మూడు రాజధానుల విషయంలో ఏం చెప్పామో.. దానికే కట్టుబడి ఉన్నామని జగన్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదే.. అసెంబ్లీలో లెక్కలు చెప్పిన మంత్రి..


  రాజధాని, సీఆర్డీఏ చట్టానికి సంబంధించి హైకోర్టు తీర్పును గమనిస్తే.. రాజ్యాంగపరంగా కాకుండా.. రాష్ట్ర శాసన సభ అధికారాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని జగన్ కోరారు. రాష్ట్ర హైకోర్టు తన పరిధిని దాటినట్లు అందిరికీ అనిపించిందని జగన్ అభిప్రాయపడ్డారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలా..? ఐతే ఈ కోడ్ ఎంటర్ చేయండి.. వైసీపీ నేతపై ట్రోలింగ్..


  రాజధాని ఎక్కడ ఉండాలనే అంశాన్ని నిర్ణయించే అధికారం శాసనసభకు లేదని కోర్టు తెలిపిందన్నారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని కోర్టు చెప్పిందని జగన్ గుర్తుచేశారు. హైకోర్టు తీర్పు దేశ సమాఖ్య స్ఫూర్తికి, శాశన సభ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని.. శాసనసభ అధికారాలను హరించేలా ఉందని జగన్ అన్నారు. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఉండదని.. గతంలో కేంద్రం ఇదే చెప్పిందని తెలిపారు. రాష్ట్ర రాజధానితో సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ను జగన్ సభ ముందుంచారు.

  ఇది చదవండి: చంద్రబాబుకు కొత్త నిక్ నేమ్.. జే బ్రాండ్ వైసీపీ ఇచ్చిన అర్ధం ఇదే..!


  రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రప్రభుత్వానికే ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టులకు చెప్పినప్పుడు.. ఆ అధికారం తమకు లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. హైకోర్టును అవమానించడానికి తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. కానీ సభ అధికారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాసన వ్యవస్థపై ఉందని సీఎం అన్నారు. ఈ తీర్పుతో హైకోర్టు తన పరిధిని దాటిందని జగన్ అన్నారు

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు