హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న సీఎం జగన్.. ఈనెల 21న ముహూర్తం..? అసెంబ్లీలో ఏం జరగబోతోంది..?

YS Jagan: ఆ విషయంలో తగ్గేదేలేదంటున్న సీఎం జగన్.. ఈనెల 21న ముహూర్తం..? అసెంబ్లీలో ఏం జరగబోతోంది..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం పాలనా వికేంద్రీకరణ. రాజధానిగా ఆమరావతి (Capital Amaravati) ని కాదని.. మూడు రాజధానులు నిర్మిస్తామని సీఎం జగన్ (CM YS Jagan) అసెంబ్లీలో ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YSRCP) ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకున్న సంచలన నిర్ణయం పాలనా వికేంద్రీకరణ. రాజధానిగా ఆమరావతి (Capital Amaravati) ని కాదని.. మూడు రాజధానులు నిర్మిస్తామని సీఎం జగన్ (CM YS Jagan) అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అనూహ్య మలుపులు తిరిగింది. రైతుల అరెస్టులు, కార్యాలయాల తరలింపుకు ప్రభుత్వం సిద్ధమవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ కొలిక్కి వచ్చే సమయానికి ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.

  ఐతే బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును సమగ్రంగా తీసుకొస్తామని అప్పట్లో సీఎం జగన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇటీవల హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిన్వడంతో పాటు రాజధాని మాస్టర్ ప్లాన్ ను మార్చడానికి వీల్లేదని.. ఒప్పందం ప్రకారమే రైతులకు ఫ్లాట్లు రిజిస్టర్ చేయాలని ఆదేశించింది. దీంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల విషయంలో వెనక్కితగ్గిందని అందరూ భావించారు. కానీ మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం కోర్టు తీర్పు తర్వాత కూడా మూడు రాజధానులకు అనుకూలంగా ప్రకటనలు చేశారు.

  ఇది చదవండి: Pegasus ఉచ్చులో చంద్రబాబు..? మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.. లోకేష్ రియాక్షన్ ఇదే..!

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధానుల ఊసు లేకపోవడంతో ఇక అమరావతి నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గుచూపనుందని అందరూ అనుకుంటున్నారు. ఐతే ఇటీవల తాజాగా మూడు రాజధానుల విషయంలో తగ్గేదేలేదని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మూడు రాజధానులకు మద్దతిస్తున్నవారు, పలువురు నాయకులు సీఎం జగన్ ను కలవగా.. మూడు రాజధానుల అంశంపై తెరపైకి వచ్చింది. ఈ భేటీలో ఈనెల 21న మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో తీసుకొస్తామని వారితో సీఎం అన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన వారు కూడా ఇదే మాట చెప్పారు. దీంతో మూడు రాజధానులపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

  ఇది చదవండి: ఏపీలో ఆర్ఆర్ఆర్ కు స్పెషల్ పర్మిషన్.. టికెట్ ధర ఎంతంటే.. ప్రభుత్వ ఆదేశాలివే..!

  అమరావతిని నిర్మించాలని, కార్యాలయాలు తరలించడానికి వీల్లేదని.. మాస్టర్ ప్లాన్ లోనూ మార్పులు చేయడానికి కుదరదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో మూడు రాజధానుల బిల్లును తీసుకొస్తామని జగన్ చెప్పడం చర్చనీయాంశమవుతోంది. బిల్లులో ఏముండబోతోంది.. ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చనుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారింది. సీఎం కామెంట్స్ నేపథ్యంలో అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయనుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, Ap capital, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు