జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాల (Jangareddygudem Mystery Deaths) చుట్టూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు తిరుగుతున్నాయి. అసెంబ్లీ (AP Assembly 2022) లో టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, నారాయణ స్వామితో భేటీ అయిన సీఎం జగన్.. వారికి కీలక ఆదేశాలిచ్చారు. ముగ్గురు మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన సీఎం.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రచారాన్ని అసెంబ్లీలోనూ, బయట గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. మంత్రుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్న సీఎం.. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని నిర్ణయించారు. మిస్టరీ మరణాలపై పూర్తి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ఆరోపణలకు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీ లోపల బయట మంత్రులు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్ పట్ల టీడీపీ అనుచితంగా ప్రవర్తించిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు., వాస్తవాలు ప్రజలకు తెలియకుండా రాద్ధాంతం చేశారని నిప్పులు చెరిగారు. ర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స..,సభలో గొడవ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు స్పీకర్ పోడియం వద్దకు కూడా దూసుకు వస్తున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై అసత్య ప్రచారం చేస్తూ బురద చల్లుతున్నారని.,. దాన్ని పట్టుకుని టీడీపీ శవ రాజకీయాలు చేస్తోందని బొత్స ఆరోపించారు.
సభలో టీడీపీ పక్కా ప్లాన్ ప్లకారం డ్రామాలు ఆడుతోందని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు నిర్దేశం మేరకే సభలో టీడీపీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో గొడవ చేసి, సస్పెన్షన్‌కు గురై, బయటకు వచ్చి విమర్శలు చేసి, జంగారెడ్డిగూడెం పోవాలని టీడీపీ సభ్యులు వ్యూహం పన్నారని అప్పలరాజు విమర్సించారు.
ఇక సభలోనూ వైసీపీ సభ్యులు, మంత్రులు టీడీపీ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలను వేధించడంలో వారిపై లైంగిక వేధింపులు చేయడంలో నెంబర్ వన్ గా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ హయాంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపారన్నారని ఆమె గుర్తుచేశారు.
చంద్రబాబు అధికారంలో ఉంటే మద్యపానానికి అనుకూలంగా మీడియాలో వార్తలు రాయిస్తున్నారని.., చంద్రబాబు అధికారంలో లేకుండా ఉంటే మద్యపాన నిషేధానికి అనుకూలంగా కథనాలు రాయిస్తారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. జంగారెడ్డిగూడెంలో మృతి చెందిన వారి కుటుంబాలు ఎక్కడా నాటుసారా గురించి మాట్లాడలేదని.. శ్మశానంలో శవాల లిస్ట్ తీసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మద్యపానం కారణంగా నమోదైన ప్రతిమరణానికి చంద్రబాబే కారణమన్న నాని.. రాష్ట్రంలో బెల్టుషాపులు తొలించిన వ్యక్తి జగన్ అని గుర్తుచేశారు.
మరోవైపు టీడీపీ మాత్రం సభలో ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. జంగారెడ్డిగూడెం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందంటూ అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసిన టీడీపీ సభ్యులు.. మద్యపానంపై మాట తప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022, Ap cm ys jagan mohan reddy