Home /News /andhra-pradesh /

AP POLITICS CM YS JAGAN FIXED TARGET TO YSRCP LEADERS FOR NEXT ELECTIONS FULL DETAILS HERE PRN GNT

YS Jagan: మిషన్ 175.. పార్టీ నేతలకు జగన్ టార్గెట్.. వైసీపీ కొత్త వ్యూహం ఇదే..!

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఎన్నికలకు రెండేళ్ల ముందే సీఎం జగన్ (AP CM YS Jagan) వైసీపీ (YSRCP) నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. 2024లో 175కు 175 సీట్లు గెలవాలని ఆయన స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో వర్క్ షాప్ నిర్వహించారు.

ఇంకా చదవండి ...
    ఎన్నికలకు రెండేళ్ల ముందే సీఎం జగన్ (AP CM YS Jagan) వైసీపీ (YSRCP) నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. 2024లో 175కు 175 సీట్లు గెలవాలని ఆయన స్పష్టం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లి (Tadepalli) లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని.., దాదాపు 8 నెలలపాటు జరుగుతుందని జగన్ తెలిపారు. సచివాలయానికి రెండు రోజుల చొప్పున ప్రతి ఇంటికీ వెళ్లాలని సీఎం ఆదేసించారు. నెలలో 20 రోజులచొప్పున 10 సచివాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అనే అంశాలను కూడా నిరంతరంగా చర్చించుకోవాలన్నారు సీఎం.

    దీని కోసం నెలకోసారి వర్క్‌ షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ నెలరోజుల్లో చేపట్టిన గడపగడపకూ కార్యక్రమం, ఈ కార్యక్రమం ద్వారా మనకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ పై ఈ వర్క్‌ షాపులో చర్చిస్తామన్నారు. ఇంకా మెరుగ్గా, సమర్థవంతంగా కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్నదానిపై ఈ వర్క్‌ షాపుల్లో దృష్టిసారించనున్నట్లు చెప్పారు. ఈ వర్క్‌ షాపుల్లో ప్రజాప్రతినిథుల నుంచి సూచనలు, సలహాలు కూడా నిరంతరంగా తీసుకొని చర్చిస్తామన్నారు.

    ఇది చదవండి: వైసీపీకి కొత్త వ్యూహకర్త.. పీకే ప్లేస్ లో వచ్చేది ఆయనే..!


    వర్క్‌ షాపుకు హాజరైనవారు కూడా ఈ అంశాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని.., దీనివల్ల మన ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. గడపగడపకూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు ప్రజలనుంచి వచ్చిన విజ్ఞాపనలు, ఆ విజ్ఞాపనల పరిష్కారంకూడా అత్యంత ముఖ్యమైందని సీఎం సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా సాగడంపైన కూడా దృష్టిపెడుతున్నామన్న జగన్.. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని.., వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సాధించాలని పిలుపునిచ్చారు. ఇదే మన లక్ష్యమని.., 175 సీట్లు సాధించడం కష్టమేమి కాదన్నారు.



    ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తుందో వివరించాలని.. ఏయే పథకాలు అందుతున్నాయో చెప్తున్నారని.., మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా పథకాలందిస్తున్నామని జగన్ వివరించారు.

    ఇది చదవండి: అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి.. మరో వారమే గడువు..!


    పథకాల అమలులో చరిత్రలో మనం ఒక ముద్ర వేశామన్న జగన్.., సంతృప్తిస్థాయిలో మంచి చేశామని చెప్పుకోగలుగుతున్నామన్నారు. అందుకే ప్రజల్లో కాలర్‌ ఎగరేసుకుని తిరగగలుగుతున్నామని.., ఇక చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతును మనం తీసుకోవడమేనన్నారు. కుప్పం మున్సిపాలిటీని గెలుస్తామని ఎవరన్నా అనుకున్నారా..?ఎంపీటీసీలు, జడ్పీటీసీలు క్లీన్‌ స్వీప్‌ చేస్తామని? ఊహించామా అని ప్రశ్నించిన జగన్.. అలాగే 175కి 175 సీట్లు సాధించగలుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు