హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: సీఎం వద్దకు నెల్లూరు పంచాయతీ.. ఆ నేతలపై జగన్ సీరియస్..

AP Politics: సీఎం వద్దకు నెల్లూరు పంచాయతీ.. ఆ నేతలపై జగన్ సీరియస్..

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. జిల్లాకు చెందిన కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (AP Minister Kakani Govardhan Reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Ex. Minister Anil Kumar Yadav) మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (AP Cabinet Reshuffle) తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. జిల్లాకు చెందిన కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (AP Minister Kakani Govardhan Reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Ex. Minister Anil Kumar Yadav) మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరూ పోటాపోటీగా సభలు, ఊరేగింపులు పెట్టుకోవడం, ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తుండటంతో నేరుగా కాకపోయినా పరోక్షంగా విమర్శిలు చేసుకోవడంతో జిల్లా వైసీపీలో తీవ్రకలకలం రేగింది. ఐతే జిల్లాలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు సీఎం జగన్ వద్దకు చేరింది. దీంతో ఇద్దరిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరినీ తాడేపల్లికి రావాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత నెల్లూరు పంచాయతీకి శుభం కార్డు పడుతుందని నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

  ఏపీ కేబినెట్ లో కొత్త మంత్రులు కొలువుదీరిన తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్.. నెల్లూరు సిటీలోని వైసీపీ నేతలు, కార్యకర్తలతో సభ ఏర్పాటు చేశారు. అదే రోజు మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాలో అడుగుపెట్టారు. మంత్రికి కౌంటర్ గా అనిల్ సభ పెట్టారన్న ప్రచారం జరిగినా వెనక్కి తగ్గని ఆయన., కార్యకర్తల సమావేశంలో తనకు ఎవరూ పోటీ కాదని.. తనకు తానే పోటీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ఆ సమావేశంలో ఎక్కడా మంత్రి ఫోటో కనిపించలేదు.

  ఇది చదవండి: ఆ రెండు జిల్లాల్లో పొలిటికల్ హీట్.. రోజాకు మంత్రి పదవి ఇవ్వడమే కారణమా..


  ఇటు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి (Kakani Govardhan Reddy) సైతం.. అనిల్ కు వ్యతిరేకంగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నారనే ప్రచారం ఉంది. అనిల్ మినాహా మిగిలిన ఎమ్మెల్యేలను అందరినీ స్వయంగా కలుస్తూ.. వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంటే అనిల్ ను ఒంటరి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని ప్రచారం ఉంది.

  ఇది చదవండి: తూచ్.. నేనలా అనలేదు..! అధిష్టానంపై యుద్ధం వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ..!


  మరోవైపు మంత్రి ర్యాలీ సంద్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్సీలు తొలగించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. తాజాగా మరోసారి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తనపై విమర్శలు చేసిన ఆనంలా.., తాను పార్టీలు మారలేదని నేరుగా కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో అనధికారికంగా ఫ్లెక్సీలు వేయవద్దని ముందే చెప్పానని.. అందువల్లే కార్పొరేషన్ సిబ్బంది తొలగిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తన ఫ్లెక్సీలు కూడా వేసుకోవడంలేదని గుర్తుచేశారు. అయితే తాను సర్వేపల్లి నియోజకవర్గానికి వెళ్లడాన్ని సైతం తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. తన బంధువుల సంవత్సరీకానికి సర్వేపల్లి వెళ్తే.. దానిని కూడా రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. తానేమైనా అంటారానివాడినా.. ఎక్కడికీ పోకూడడా.. ఇదేం న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య వైరం సీఎం వరకు వెళ్లడంతో తాడేపల్లిలో ఏం తేలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు