హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. వెలసిన ఫ్లెక్సీలు.. కేసీఆర్ టార్గెట్ ఎవరు.. టచ్ లో ఉన్నది ఎవరు?

BRS In AP: ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. వెలసిన ఫ్లెక్సీలు.. కేసీఆర్ టార్గెట్ ఎవరు.. టచ్ లో ఉన్నది ఎవరు?

ఏపీ లో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు

ఏపీ లో భారీగా వెలసిన కేసీఆర్ ఫ్లెక్సీలు

BRS In AP: ఆంధ్రప్రదేశ్ పైనా తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారా..? ఇక్కడ కూడా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికే విజయవాడలో భారీగా కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. పలువురు నాయకులు టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  BRS In AP: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారత రాష్ట్రీయ సమితి (BRS) హాట్ టాపిక్ అవుతోంది. ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పైనా..? ప్రత్యేక ఫోకస్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా సంక్రాంతికి భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇక్కడ బీఆర్ఎస్‌ కు ఆదరణ ఉంటుందని టీఆర్ఎస్ (TRS) వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా.. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. చాలామంది నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు, నేతలతో పరిచయాలు ఉన్న కొందరు నేతలు.. ఏపీలో కేసీఆర్ ప్లాన్ పై ఆరా తీస్తున్నారని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏపీలో పార్టీని విస్తరించడంలో భాగంగా..

  వచ్చే సంక్రాంతి నాటికి విజయవాడ (Vijayawada), గుంటూరు (Gunturu) ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు రచించినట్టు సమాచారం. ముఖ్యంగా గతంలో రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉండి.. ప్రస్తుతం యాక్టివ్ గా లేవని వారిని సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.  టీఆర్ఎస్ నేతలతో గతంలో కలిసి పని చేసిన కొందరు తెలుగు దేశం నేతలతో కూడా మాట్లాడే అవాకశాలు ఉన్నాయి. బీజేపీలో ఉన్న కొందరి నేతలను కూడా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

  తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితిని.. జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పార్టీ సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితి పేరు మారింది. దసరా పర్వదినం రోజున జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంతోపాటు.. సీఎం కేసీఆర్ పార్టీ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర పోస్టర్లు, హోర్డింగులు అన్ని ప్రాంతాల్లో వెలుస్తున్నాయి.

  ఇదీ చదవండి : ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు.. ఈ సారి ఎన్ని లడ్డూలు విక్రయించారు?

  అలాగే ఏపీలోనూ భారత్ రాష్ట్ర సమితి హోర్డింగులు వెలిశాయి. విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట వారధి సెంటర్ వద్ద భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ప్రకటిస్తున్న జయహో కేసీఆర్ అంటూ హోర్డింగ్‌పై.. కీసీఆర్, కేటీఆర్ చిత్రాలను ముద్రించారు.

  ఇదీ చదవండి : సీఎం సీఎం అంటూ కోలాహలం.. సందడిగా బావతో బాలయ్య టాక్ షో.. మంత్రుల సెటైర్లు.. ఏమన్నారంటే?

  వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరు చోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. కాగా.. ఏపీలోనూ సీఎం కేసీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ హోర్డింగ్‌లు ఏర్పాటు కావడంపై వాహనదారులు, పాదచారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దీంతోపాటు ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, CM KCR, KCR New Party, Vijayawada

  ఉత్తమ కథలు