AP POLITICS CM KCR BEHAIND R KRISHNAIAH SELECTED AS RAJYASABHA MEMBER FROM ANDHRA PRADESH NGS
AP Politics: ఆయనకు రాజ్యసభ పదవి వెనుక కేసీఆర్ హస్తం.. గుండు గీయుంచుకుంటాను అంటూ ఛాలెంజ్
కృష్ణయ్య, జగన్, కేసీఆర్
AP Politics: ఇటీవల రాజ్యసభకు నలుగురు పేర్లను ప్రకటించారు సీఎం జగన్.. ఆయా సభ్యుల ఎంపికపై వివాదం కొనసాగుతూనే ఉంది. విజయసాయి రెడ్డికి రెన్యువల్ కొనసాగింపు. బీద మస్థాన్ రావ్ మినహాయించి.. మిగిలిన ఇద్దరి ఎంపిపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ అంశం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ సూచనతోనే ఆయనకు రాజ్యసభ పదవి దక్కిందని ప్రచారం జరుగుతోంది.
AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇటీవల రాజ్యసభ పదవులకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేశారు సీఎం జగన్ (CM Jagan).. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు వైసీపీకే సొంతం అవుతుండడంతో.. ఆ పదవుల కోసం చాలామంది లాబీయింగ్ చేశారు.. మరికొందరు చాలా ఆశలు పెట్టుకున్నారు.. అధినేత మాత్రం ఎవరూ ఊహించని విధంగా కొందరిని తెరపైకి తెచ్చారు.. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), బీద మస్తాన్ రావు (Beeda Masthan Rao), నిరంజన్ రెడ్డి (Niranjan Reddy), ఆర్.కృష్ణయ్య (R Krishnaiah) లకు అవకాశం ఇచ్చారు. అందులో ఎంపీ విజయసాయి రెడ్డికి రెన్యువల్ చేస్తారు అని అంతా ఊహించనదే.. ఇక గత ఎన్నికల్లో టీడీపీ (TDP)లో కీలకంగా వ్యవహరించిన బీద మస్థాన్ రావు.. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం తరువాత ఆయన.. జగన్ కు జై కొట్టారు.. ఆ సమయంలోనే రాజ్యసభ పదవి ఇస్తారని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అందులోనే ఆయన బీసీ వ్యక్తి అవ్వడంతో.. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు రాజ్యసభవి దక్కింది. అయినా ఆయన ఎంపికపై విమర్శలు వచ్చాయి. టీడీపీ నుంచి వచ్చిన బీసీ అభ్యర్థులే వైసీపీకి దిక్కయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు చేశారు.
మిగిలిన ఇద్దరి ఎంపిక విషయంలో మాత్రం ఇంకా పొలిటికల్ రచ్చ ఆగడం లేదు. నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యల ఎంపిక విషయంలో రాజకీయంగా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఏపీలో వైసీపీకి అభ్యర్థులే లేరా..? తెలంగాణ వాళ్లను ఎలా ఎంపిక చేశారంటూ.. సొంత పార్టీ నేతలే లోలోన మదన పడుతున్నట్టు సమాచారం. తెలంగాణ, ఆంధ్రా సమస్యలు వచ్చినప్పుడు సభలో ఎటువైపు వారి వాదన వినిపిస్తారని ప్రశ్నిస్తున్నారు.. తాజాగా ఆర్.కృష్ణయ్య విషయంలో మరో అంశం తెరపైకి వచ్చింది.
విమర్శలు ఎలా ఉన్నా..? బీసీ ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. ఉద్యమకారుడైన తనను జగన్ ఎంపిక చేయడం వెనకాల బీసీలకు న్యాయం చేయాలని తపన వుంది అంటున్నారు కృష్ణయ్య.. ఆయన ఎంపిక వెనుక సీఎం కేసీఆర్ సూచన ఉందని వైసీపీ వర్గాల టాక్. తెలంగాణను నుంచి అవకాశం ఇస్తే.. రాజకీయంగా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో.. ఆయన ఏపీ సీఎం జగన్ కు సిఫార్సు చేశారని.. ఆయన మాట కాదనలేక జగన్ ఒకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అలా అయితే తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో.. కృష్ణయ్య సహకారం టీఆర్ఎస్ కు ఉంటుందనే వాదన ఉంది. ఓ ఛానెల్ తో మాట్లాడిన కృష్ణయ్య సైతం పరోక్షంగా ఆ విషయాన్ని కానీ సీఎం కేసీఆర్ తనను గుర్తించారని, అయితే ముందుగా జగన్ అవకాశం ఇచ్చారని వెల్లడించారు. అందుకే ఈ పదవి వెనుక కేసీఆర్ హస్తం వుందనే ప్రచారం జరుగుతోంది.
ఇంకా ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. తాను పదవులు కావాలనుకుంటే కలెక్టర్ అయ్యేవాడిని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రి పదవిని కూడా వదులకున్నాను అన్నారు. తాను పదవుల కోసం పనిచేయలేదన్నారు. బీసీలకు అండగా వుండడానికి తాను శక్తివంచనలేకుండా పనిచేస్తాను అన్నారు. తనకు రాజ్యసభ పదవి రావడం వల్ల బీసీల ఔన్నత్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల బీసీల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానని భరోసా ఇస్తున్నారు. అలాగే కృష్ణయ్యకు పదవి ఇచ్చి జగన్ ఇబ్బందులు పడుతున్నారనేది అపోహ మాత్రమే అన్నారు. ఏపీలో కృష్ణయ్యకు పదవి ఇవ్వడం సరైనదేనా అని ఆ ఛానెల్ సర్వే చేయించాలని.. ఆ సర్వేలో ఎవరైనా తప్పని అంటే తాను గుండు గీయించుకుంటానన్నారు. 1976 నుంచి నేను ఉద్యమంలో వున్నానన్నారు. తనను వాడుకుని టీడీపీ గెలిచిందన్నారు. ఒక్కోసారి తానే పార్టీలను వాడుకున్నానని చెప్పారు కృష్ణయ్య.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.