హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం జగన్ మరో డేరింగ్ స్టెప్.. ప్లీనరీ వేదికగా కీలక ప్రకటన.. ప్రతిపక్షాలకు షాక్ తప్పదా..?

CM Jagan: సీఎం జగన్ మరో డేరింగ్ స్టెప్.. ప్లీనరీ వేదికగా కీలక ప్రకటన.. ప్రతిపక్షాలకు షాక్ తప్పదా..?

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

CM Jagan: వైసీపీ అధినేత సీఎం జగన్.. పాలనపై పట్టు ఎలా ఉన్నా.. డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనది ప్రత్యేక శైలి. పార్టీ అధికారంలో లేనప్పుడే ఎవరూ ఊహించని విధంగా ఓకేసారి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ప్లీనరీ వేదికగా మరో కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు సమాచరం.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..?

ఇంకా చదవండి ...

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. సాధరణంగానే ఆయనకు డేరింగ్ లీడర్ అనే పేరు ఉంది. ఏదైనా నిర్ణయాన్ని ఎలాంటి భయం లేకుండా.. వెనుక ముందు ఆలోచించకుండా చెప్పగల ధైర్యం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ఓ వైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు తప్పవని.. 2023లోనే ఎన్నికలు ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలపైన ఒత్తిడి పెంచుతూ.. కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీ (YCP Pleenary) వేదికగా ఈ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల కోసం అందరికంటే ముందుగానే అడుగులు వేస్తున్నారు. కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటు చేశారు. మంత్రి వర్గ విస్తరణతో.. ఎన్నికల టీంను తయారు చేసుకున్నారు. మాజీలు అయనవారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు. రీజనల్ కోర్డినేటర్లు అంటూ పార్టీని పరుగులు పెట్టించే బాధ్యతలు ఇచ్చారు. ఇక గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోనే ఉండేలా చేశారు. సామాజికి న్యాయ భేరి పేరుతో మంత్రులతో బస్సు యాత్ర చేయించారు.

రెండో సారి అధికారమే లక్ష్యంగా ఆయన ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జనగ్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ వ్యూహాలకు అందకుండా.. జెట్ స్పీడ్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదన్న విషయంలోనూ.. ప్లీనరీ వేదికగానే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు నిర్ణయాలతో ప్రతిపక్షాల పైన ఒత్తిడి పెంచే వ్యూహం ఆయన అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇదీ చదవండి : చంద్రబాబుకు ఎమ్మెల్యే అభినందనలు.. కాదంటూ మంత్రి విమర్శ.. ఒకే వేదికపై ఇద్దరూ ఇలా?

ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇటీవల తాను తెప్పించుకున్న నివేదికలు.. గడప గడపకు ప్రభుత్వం తరువాత ఎమ్మెల్యే పనితీరును పరిగణలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్లీనరీ వేదికగానే సీఎం జగన్ తాను ఎన్నికలకు ఆరు నెలల నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించే అంశం పైన ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటనతో అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి..వారితో ఎన్నికల సమయానికి పూర్తిగా మమేకం అయ్యేలా చూడాలని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల పైన టిక్కెట్ల ఒత్తిడి పెరగటం తో పాటుగా టిక్కెట్లు ఎవరికి ఇచ్చేది తేల్చేయటం ద్వారా పోటీలో ఉండే అభ్యర్ధులకు ప్రచారానికి.. ప్రజలతో దగ్గరవ్వటానికి సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి : ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ షాకిస్తున్న బెంగాల్ టైగర్.. బోనులోకి వచ్చేదెలా..?

టిక్కెట్లు ఈ సారి ఇవ్వలేక పోయే వారికి సైతం క్లారిటీ ముందుగానే ఇస్తారని తెలుస్తోంది. అలాగే తాను ప్రకటించే అభ్యర్థిని గెలిపిస్తే.. భవిష్యత్తులో వారికి ఏమీ చేస్తారు అన్నదానిపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇక,ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికల పైన కీలక ప్రకటనతో పాటుగా.. 2019 ఎన్నికల హామీలు...2024 లో చేయబోయే కార్యక్రమాల పైన ముందుగానే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ysrcp

ఉత్తమ కథలు