CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారా.. ఢిల్లీ పెద్దలతో వరుస భేటీల తరువాత దీనిపై నిర్ణయం తీసుకున్నారా..? అసలు ఢిల్లీ (Delhi) లో ఏం జరిగింది.. జగన్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి అన్నదానిపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన ఢిల్లీలో బుధవారం ఢి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ను కలిశారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Niramal Sitaraman) తోభేటీ అయ్యారు. అయితే నిర్మలా సీతారామన్‌ను గురువారం ఉదయం కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులు, బకాయిల విడుదలపై ఆర్థిక మంత్రితో చర్చించారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాష్ట్ర అవసరాలు.. నిధులతో పాటు.. ఏపీ రాజకీయాలపైనా అమిత్ షాతో చర్చించినట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. అత్యవసరంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ కావాలని నిర్ణయించారు..
ఏప్రిల్ 3వ తేదీన సీఎం జగన్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ మీటింగ్ ను ఫిక్స్ చేయడం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. సాధారణంగా ఏపీ వచ్చిన తరువాత మీటింగ్ గురించి చెప్పి ఉంటే పెద్దగా చర్చ జరిగేది కాదు.. ఆయన ఢిల్లీలో ఉప్పుడు మీటింగ్ కు కాల్ ఇవ్వడంతో ఏదో జరుగుతోంది అని ఊహాగానాలు పెరుగుతున్నాయి. అది కూడా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సమావేశం నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను కేడర్‌ను సన్నద్ధం చేసేలా సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ః
ఇదీ చదవండి : తిరుచానూరులో గోవిందరాజు స్వామికి ఆలయం ఎందుకు లేదు? అసలు మిస్టరీ తెలిస్తే షాక్
అయితే ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య వెంటాడుతోంది. కేంద్రం నుంచి నిధుల రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం కూడా కష్టమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా పథకం నిలిచిపోయానా.. కాస్త వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. అంతేకాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా యువత, విద్యావంతుల్లో వ్యతిరేకత ఉందనే విషయం అర్థమైంది.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యతిరేకత పెరిగితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే బెటర్ అని సీఎం జగన్ అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతోంది. అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ననిలిచిపోక ముందే ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ప్లాన్‌గా ఉందని కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics