Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN TOOK KEY DECISION ON CHEVIREDDY BHASAKR REDDY BEFORE CABINET RESHUFFLE FULL DETAILS HERE PRN TPT

AP New Cabinet: కేబినెట్ కుర్చీలాట నుంచి కీలక నేత ఔట్.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

కొత్తకేబినెట్ (AP New Cabinet list) పై కసరత్తును పూర్తిచేసే పనిలో ఉన్న సీఎం జగన్ (CM YS Jagan) .. ఆశావాహుల్లో ఒక్కొక్కర్నీ తప్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురుకి పదవిపై స్పష్టత ఇచ్చిన సీఎం.. మరో కీలక నేతను కేబినెట్ కుర్చీలాట నుంచి తప్పించారు.

ఇంకా చదవండి ...
  GT Hemanth Kumar, News18, Tirupati

  కొత్త కేబినెట్ (AP New Cabinet list) పై కసరత్తును పూర్తిచేసే పనిలో ఉన్న సీఎం జగన్ (CM YS Jagan) .. ఆశావాహుల్లో ఒక్కొక్కర్నీ తప్పిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురుకి పదవిపై స్పష్టత ఇచ్చిన సీఎం.. మరో కీలక నేతను కేబినెట్ కుర్చీలాట నుంచి తప్పించారు. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్లే అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరుగా సాగింది. పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి నియోజకవర్గం చిత్తూరులో ఉండటంతో ఈ సారి చెవిరెడ్డికి మంత్రి పదవి ఇస్తారంటూ పార్టీలో ప్రచారం జరిగింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం రాక మునుపు వరకు ప్రతిపక్షాన్ని చీల్చి చెండాడిన చెవిరెడ్డి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడంలో ఎంతో చురుకుగా పనిచేస్తున్నారన్న మాట ప్రజలతో పాటు.. పార్టీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు.

  ఇక పార్టీకి అత్యంత ముఖ్యమైన నాయకులూ సజ్జల రామకృష్ణ రెడ్డి., విజయసాయిరెడ్డి., వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి., పెద్దిరెడ్డిలతో ఎంతో సన్నిహితంగా మెలిగే చెవిరెడ్డిని కాదని వేరొకరికి మంత్రిపదవి ఇవ్వరనే వాదన సాగింది. పార్టీ రాకముందు ఎన్నో అవమానాలు., మరిన్నో కేసులను ఎదుర్కొన్నారు చెవిరెడ్డి. 2019లోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారైనా కేబినెట్ బెర్త్ గ్యారెంటీ అనుకున్నా.. సీఎం జగన్ అనూహ్య నిర్ణయం చీసుకున్నారు.

  తుడా ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదవీకాలం పొడిగింపు

  ఇది చదవండి: గౌతమ్ రెడ్డి వారసుడు ఆయనే.. మేకపాటి కుటుంబం కీలక నిర్ణయం.. మంత్రి పదవి కూడా..?


  చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ పదవిని పొడిగిస్తూ ఇచ్చిన జీవో పార్టీ క్యాడర్ తో పాటు... చెవిరెడ్డి వర్గీయుల ఆశపై నీళ్లు చల్లింది. ఏపీ ప్రభుత్వ విఫ్, తుడా చైర్మన్, టీటీడీ పాలకమండలి ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా పదవులు ఉన్న చెవిరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాలు మెండుగా ఉన్నాయని అనుకొనే లోపే రెండేళ్ల తుడా చైర్మన్ గా పొడిగింపుతో బ్రేకులు వేసినట్లు అయింది.

  ఇది చదవండి: ఏపీ ప్రజలు కరెంట్ షాక్... అప్పటివరకు కోతలు తప్పవ్.. విద్యుత్ కొరతపై ప్రభుత్వం కీలక ప్రకటన


  రేసులో మరో ఎమ్మెల్యే..?
  తనదైన శైలిలో వాక్ చాతుర్యంతో చంద్రబాబుపై వ్యగ్యాస్త్రాలు సంధించే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ కు రాష్ట్ర క్యాబినెట్ లో చోటు పదిలం అంటున్నాయి పార్టీ వర్గాలు. పార్టీలో సీనియర్ నేత కావడం.., జగన్ వీరవిధేయుడు కావడంతో బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్గీయులు తమ నేతకు మంత్రి పదవి ఖాయమని లెక్కలతో సహా చెప్పుకుంటున్నారట. ఇక సీఎం జగన్ చేపట్టిన పధకాలపై మూడు కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. అందులో బంగారుతో చేసిన వైఎస్ఆర్, సీఎం జగన్ ల విగ్రహాలు సైతం ఏర్పాటు చేశారు. ప్రజలకు నవరత్నాలు అర్ధమయ్యే రీతిలో ఈ ఆలయం నిర్మించారు.

  ఇది చదవండి: అదే జరిగితే మంత్రులంతా జైలుకే.. టీడీపీ సంచలన  ఆరోపణలు..


  పార్టీ ముఖ్య నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండటం. వైఎస్ భారతమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉండటంతో ఆయనకే మంత్రి పదవి వరిస్తుందని చెప్తున్నారు. సామజిక సమీకరణాలు చూసుకున్న తిరుపతి జిల్లాలో గూడూరు., సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ తక్కువే అని చెప్పుకోవాలి
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Chevireddy bhaskar reddy

  తదుపరి వార్తలు