CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాం చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాలీ అవుతున్నాయి. వాటికి సంబంధించి అప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఆ నాలుగు సీట్లు అధికార వైసీపీ (YCP)కే దక్కనున్నాయి. దీంతో ఆశావాహుల జాబితా పెరిగింది. ఎవరికి వారు అధిష్టానం దగ్గర లాబీయింగ్ కూడా చేశారు. కానీ రాజ్యసభ ఎంపికకు సంబంధించి సీఎం జగన్ (CM Jagan) సుదీర్ఘ కసరత్తు చేశారు. వైసీపీ దక్కే నాలుగు రాజ్యసభ సీట్లలో ఎవర్ని రాజ్యసభలో కూర్చోబెట్టాలనే దానిపై పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపి ఫైనల్ చేశారని తెలుస్తోంది. పార్టీ సీనియర్లు సజ్జల (Sajjala), సుబ్బారెడ్డి(Subbareddy), సాయిరెడ్డి (Saireddy), బొత్స (Botsa) తో చర్చించారు. మొదట్లో చాలా పేర్లు తెరపైకి వచ్చిన ఆఖరి నిమిషంలో వైసీపీ బాస్ లెక్కలు మారిపోయాయి. దీంతో ఇద్దరు బీసీలను, ఇద్దరు రెడ్డిలను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్టు టాక్. ఆ ఇద్దరు బీసీల నేపథ్యం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. గతంలో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఉన్న ఆయనకు రాజ్యసభ బెర్త్ ఖరారు చేశారని ప్రచారం ఉంది. ఆయనతో పాటు గతంలో ఓ జిల్లాకు టీడీపీ అధ్య్షక్షుడిగా వ్యవహరించిన మరో నేతకు కూడా రాజ్యసభ బెర్త కాన్ఫాం అయ్యిందనే సమాచారం అందుతోంది. బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడంలో భాగంగానే వీరికి పదవులు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
మొదట రాజ్యసభ ఎన్నికల్లో ఒకటి అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. అదానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభకు ఎంపికవ్వాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొని నామినేషన్ వేయాల్సి ఉండటంతో పార్టీల తరఫున ఎంపికవడం ఇష్టంలేని అదానీ వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆ సీటును భారతీయ జనతాపార్టీ కోటాకు కేటాయించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా పరిణమాల నేపథ్యంలో ఇద్దరు రెడ్లు.. ఇద్దరు బీసీలకు టికెట్లను అధినేత ఫైనల్ చేశారు. అందులో ఒకరు ఆర్ క్రిష్ణయ్య కావడం విశేషం.. ఆయన గతంలో తెలంగాణలో మహాకూటమిగా ఏర్పడినప్పుడు తెలుగు దేశం తరపున సీఎం అభ్యర్థిగా బరిలో దిగారు..
ఇప్పటికి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పదవి కాలం ముగియడంతో మరోసారి ఆయనను రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది అందరూ మొదటి నుంచి ఊహిస్తూ వచ్చిందే.. ఆయనకు రెన్యువల్ తప్పక ఉంటుందని అంతా భావించారు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్ట్టే.. మరో సీటు అదే సమాజికవర్గానికి చెందిన మెగా ప్రొడ్యూసర్ కు చాన్స్ ఇచ్చినట్టు టాక్.
ఇదీ చదవండి : రాత్రికి రాత్రే కోటేశ్వరుడైతే..? నీటికోసం వెళ్లిన గొర్రెల కాపరికి ఏం దొరికిందో చూడండి
సీఎం జగన్ వ్యక్తిగత న్యాయవాది, నిర్మాత నిరంజన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు. మరో రెండు సీట్లలో బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన బీదమస్తాన్ రావుకి ఒక్క సీటు, బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు ఇంకో సీటు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజ్యసభ పై ఎంతో మంది అసలు పెట్టుకున్నప్పటికి జగన్ సింపుల్ గా రాజ్యసభ కు ఎవర్ని పంపాలి అనేదానిపై నిర్ణయం తీసేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayasai reddy