హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: రెండేళ్ల సమయం ఇవ్వడి.. అద్భుతాలు చేసి చూపిస్తానంటూ జగన్ హామీ

CM Jagan: రెండేళ్ల సమయం ఇవ్వడి.. అద్భుతాలు చేసి చూపిస్తానంటూ జగన్ హామీ

సీఎం జగన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్

సీఎం జగన్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్

CM Jagan: ఏపీలో విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. విద్యా దీవెన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు.. తనకు రెండేళ్ల సమయం ఇస్తే.. సర్కార్ బడులను.. కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడేలా చేస్తామని ప్రజలను కోరారు. ఇంకా ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya Deevena Kanuka) కింద ఈ ఏడాది నాలుగో విడతలో భాగంగా 698.68 కోట్లు నగదు విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లా (NTR  District)లో తిరువూరులో బటన్ నొక్కి నగదు విడుదల చేశారు. నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చదువుకు పేదరికం అడ్డు రాకూడదు అన్నారు. పిల్లల చదువే కుటుంబాల తలరాత మారుస్తుంది అన్నారు. అందుకే పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. పిల్లకు మనం ఇచ్చే ఖరీదైన ఆస్తి చదువు మాత్రమే అన్నారు.  పిల్లలు ఎంతమంది చదివినా సరే ఆ ఫీజుల బాధ్యత మీ జగనన్న తీసుకుంటాడని సగర్వంగా చెబుతున్నాను అన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిల ఖాతాల్లోకి నగదు జమచేస్తున్నామన్నారు.

గత ప్రభుత్వంలో ఫీజ్ రియింబర్స్ మెంట్ ఎంత దారుణంగా ఉండేదో అందరికీ తెలిసిందే.. ఫీజులు కట్టలేకుండా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అన్నారు. మీ జగనన్న ప్రతి ఏడాది తప్పకుండా నగదు విడుదల చేస్తున్నారని గుర్తు చేశారు. పిల్లలు చదువుతున్న కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు ఇచ్చేందుకే.. తమ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామన్నారు. కాలేజీలో వసతులు లేకుంటే.. ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు ఉండాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశం అన్నారు.

గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వం చెల్లిస్తోంది అన్నారు. విద్యార్థులు సత్యా నాదెళ్లలా తయారు అవ్వాలనే లక్ష్యంతో తాము విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడితో మొదలు పెట్టి.. విద్యా కానుక, దోరు మద్దు, నాడు నేడు లాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అలాగే స్కూల్స్ లో ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మాద్యామన్ని తప్పనిసరి చేసి విద్యార్థుల ఉన్నతికి సహకరిస్తున్నామన్నారు. 8వ తరగతి విద్యార్థుల కు ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : గదుల కేటాయింపులో రోటేషన్ పాలసీతో సామాన్యులకు సమస్యలు..? టీటీడీ ఎలా చెక్ పెట్టింది?

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తునమన్నారు. రెండు సంవత్సరాలు సమయం ఇస్తే.. ప్రభుత్వ బడులను.. కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడేలా చేస్తాను అన్నారు.  వైద్య విద్యారంగంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్పులు చేశామన్నారు. నాడు నేరు పేరుతో పాఠశాలలో రూపు రేఖలు మార్చామన్నారు. ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దడానికే అన్నారు.

ఇదీ చదవండి : పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితం వివాదం.. కేంద్ర ఎన్నికల సంఘ సీరియస్

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నామన్నారు. కేవలం కాలేజీ, స్కూళ్ల ఫీజులు చెల్లించడమే కాదు.. వసతి ఖర్చులు కూడా ఇస్తున్నామన్నారు. ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ap welfare schemes

ఉత్తమ కథలు