CM Jagan gave big Offer: రాబోయే ఎన్నికలను టార్గెట్ చేస్తే సీఎం జగన్ (CM Jagan) తన కేబినేట్ విస్తరణ (Cabinet Reshuffle)నను పూర్తి చేశారు.. సుదీర్ఘ కసర్తుత తరువాత సామాజికి సమీకరణల నేపథ్యంలో కొత్త టీంను రెడీ చేసుకున్నారు. అయితే ఆ కేబినెట్ పునర్వవ్యవస్థీ కరణ చిచ్చు ఇంకా వైసీపీ లో కొనసాగుతూనే ఉంది. మంత్రి పదవులు రాక కొంత మంది అసంతృప్తితో రగలిపోతుంటే. పదవులు వచ్చిన కొందరు సైతం అసహనంతో ఉన్నట్టు సమాచారం. తమ అనుభవానికి సరైన ప్రాదాన్యత ఉన్న శాఖలు కట్టబెట్టలేదని అసంతృప్తితో ఉన్నారని టాక్.. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న సంఘటనను ఉదాహారణగా చెప్పవచ్చు. బొత్స సత్యనారాయణ (Bota Satyanarayana) తనకు మంత్రి పదవి కొనసాగించినప్పటికి తనకు కేటాయించిన శాక పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రిగా తాను బాధ్యతలు చెపట్టిన తరువాత శాఖాపరంగా నిర్వహించిన రివ్యూ మీటింగ్ కు బొత్స డుమ్మా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు గతంలో మంత్రులుగా కొనసాగి కేబినేట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవులు కొల్పొయిన నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా కొంత మంది ఆగ్రహాన్ని చల్లార్చినప్పటికి మాజీ మంత్రి బాలినేని (Ex Minster Balineni) లాంటి నేతల అసంతృప్తిని తీర్చడానికి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. అందులో భాగంగా తాజాగా మాజీ మంత్రి జగన్ కు స్వయన బంధువైన బాలినేనికి అసంతృప్తిని తీర్చే పనిలో భాగంగా ఇచ్చిన హామీ ఇప్పుడు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ హాట్ టాపిక్ గా మారిందని అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. ఇదీ చదవండి: టీడీపీలో మోగిన గంట.. అనూహ్యంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు.. ఆయన స్ట్రాటజీ ఏంటి?
మంత్రి పదవి నుంచి తనను తప్పించనందుకు కాకుండా.. గత ఎన్నికల్లో తాను టిక్కెట్ ఇప్పించిన మరో నేత ఆదిమూలపు సురేష్ మంత్రి పదవి కొనసాగించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో సజ్జల పలు మార్లు బాలినేనితో భేటీలు నిర్వహించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలినేని పార్టీకి రాజీనామా చేయడం ఖాయం అనే వార్తలు ఒక్కసారిగా చర్కర్లు కొట్టాయి.
ఆలస్యం అయితే ప్రమాదం ఉందని గుర్తించిన సీఎం జగన్ వెంటనే రంగంలో దిగారు. బాలినేనిని స్వయంగా పిలిపించుకొని దాదాపు 2 గంటలపాటు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బాలినేనికి పలు కీలక హామీలు ఇచ్చినట్లు సమాచారం. తాను కూడా ఉహించని స్థానం త్వరలో కల్పించబోతున్నట్లు బాలినేనికి జగన్ చెప్పినట్లు సమాచారం. ఈ హామీ తరువాతే బాలినేని బయటకి వచ్చి తానికి ఎటువంటి అసంతృప్తి లేదని మీడియా ముందు వెళ్లడించారు.
అయితే జగన్ బాలినేనికి ఇచ్చిన హామీ ఏమైఉంటుందనే చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. ఈ నెల 27 తేదిన ఒంగోలు లో నిర్వహించబోయే పబ్లిక్ మీటింగ్ లో బాలినేని వేదికపైకి పిలిచి మరి తాను ఏ స్థానం కల్పించబోతున్నానో చెబుతానని జగన్ చెప్పినట్లు సమాచారం. దీంతో 27న జగన్ బాలినేకి ఎటువంటి స్వీట్ న్యూస్ చెబుతారాన్నదానిపై ఇప్పుడు ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంతో ఆసక్తిగా మారింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.