AP POLITICS CM JAGAN ONCE AGAIN FIRE ON TDP CHIEF CHANDRABABU NAIDU IN ASSEMBLY NGS
CM Jagan: ఆ పదం వింటే చంద్రబాబే గుర్తుకు వస్తారు.. ఎన్టీఆర్ నుంచి మోదీ దాకా అంటూ జగన్ సైటర్లు
సీఎం వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
CM Jagan on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ మరిచిపోలేకపోతున్నారా..? ఆ పదం వింటే చాలు ప్రతిపక్ష నేతే గుర్తొస్తున్నారా... ఎందుకు అంతలా చంద్రబాబు గుర్తొస్తున్నారో తెలుసా..?
CM Jagan on Chandrababu Naidu : అసెంబ్లీ వేదికగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై నిప్పులు కురిపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ముఖ్యంగా చంద్రబాబు సభలో లేకపోయినా ఆయనను ఉద్దేశించి మాట్లాడడం హాట్ టాప్ అయ్యింది. అయితే ఎన్టీఆర్ నుంచి మోదీ దాకా చంద్రబాబు అందరినీ వెన్నుపోటు పొడిచాడని వ్యాఖ్యానించారు. ఆడపిల్లల చదువుపై చంద్రబాబు ఏనాడైనా శ్రద్ధ చూపారా అని ప్రశ్నించారు. అక్క చెల్లెమ్మలకు నాలుగేళ్లలో 75 వేలు ఇస్తున్నామని చెప్పారు. అక్క చెల్లెమ్మలకు తోడు నిలిస్తే పేదరికం నుంచి బయటపడతారని తాము పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కానీ, చంద్రబాబు గతంలో ఎప్పుడూ వారి గురించి ఆలోచించలేదన్నారు. చంద్రబాబుకు మనసు లేదని విమర్శించారు. అలాగే టిడ్కో ఇళ్లు తామే కట్టామని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవన్నారు. టిడ్కో ఇళ్ల బాధ్యతను తామే తీసుకొని బాగు చేయించి పూర్తి చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్షల మంది పక్కా ఇళ్లు లేకుండా ఎందుకు ఉండిపోయారో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా అంటూ జగన్ నిలదీశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. మూడేళ్లలో 31 లక్షల మందికి పైగా ఇళ్లస్థలాలిచ్చి కట్టించి ఇస్తున్నామని పేర్కొన్నారు.
బీసీలను పనిముట్లుగా వాడుకోవడమే తప్ప చంద్రబాబు చేసింది ఏముందని ఆరోపించారు. మరోవైపు అగ్రిగోల్డ్ కంపెనీని దోచుకుంది చంద్రబాబు అయితే, అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిచ్చింది మాత్రం తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని తీవ్ర స్థాయిలో జగన్ మండిపడ్డారు.
అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు తీసుకెళ్లారని, అందులో 39 వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. విద్యుత్ బకాయిలు రూ.21,540 కోట్లకు పెరిగాయన్నారు. అప్పులు, వడ్డీల భారం అరాచకాలను మనపై వేసిన చంద్రబాబు.. మనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పులు తీసుకునే నిబంధనను తుంగలో తొక్కి మరీ చంద్రబాబు అప్పులు చేశారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాపాలు మనల్ని వెంటాడుతున్నాయని, కేంద్రంతో పోరాడుతున్నాం అని జగన్ చెప్పారు. ”రోజుకొక జూమ్ మీటింగ్.. అరడజను ప్రెస్ మీట్లు చంద్రబాబు పెట్టిస్తాడు. రాష్ట్రానికి చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన మేలు ఏంటి? దుర్మార్గం తప్ప.. అధికారం పోయి వెయ్యి రోజులైందని చంద్రబాబు రగిలిపోతున్నారని జగన్ మండిపడ్డారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.