AP POLITICS CM JAGAN NEW CABINET RESHUFFLE BEHIND BROTHER ANIL POLITICAL STRATEGY NGS
AP Cabinet: సీఎం జగన్ కేబినెట్ కూర్పు వెనుక బ్రదర్ అనిల్.. ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బీసీని ప్రకటిస్తుందా..?
వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ (ఫైల్)
AP Cabinet: ఏపీ కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు.. తన నైజానికి భిన్నంగా చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు చేశారు.. పాత వారిని ఇద్దరినే కొనసాగించాలని 11 మందికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ కూర్పు వెనుక రీజన్ అదేనా..? బ్రదర్ అనిల్ వ్యూహమే కారణమే..? ఆ పార్టీ బీసీని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించనుందా..?
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇటీవల జరిగిన సీఎం జగన్ (CM Jagan) కేబినెట్ ప్రక్షాళనపై రాజకీయంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనంతగా వైసీపీ అధిష్టానికి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించింది. జగన్ కు వీర విధేయులు అనే వారు కూడా అలకపాన్పు ఎక్కారు. సీఎం వెంటనే అలర్ట్ అవ్వడంతో ఆ అసమ్మతి ప్రస్తుతానికి వాయిదా అయితే పడింది.. కానీ విపక్షాలు మాత్రం కేబినెట్ పై సెటైర్లు వేస్తున్నాయి. పార్టీ నుంచి చేజారిపోతారు అనుకునే వారికే పదవులు ఇచ్చారని.. జగన్ భయపడ్డారు అంటూ విమర్శలు చేస్తున్నారు.. అలాగే కొన్ని వార్గాల వారికి ఒక్క బెర్త్ కూడా ఇవ్వకపోవడంపైనా విమర్శలు కొనసాగుతున్నాయి. మరో అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కేబినెట్ కూర్పు వెనుక.. బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రభావం ఉందంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.. ఇటీవల వైసీపీ (YCP)కి సంప్రదాయ ఓటుబ్యాంకుగా మారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల్ని లక్ష్యంగా చేసుకుని బ్రదర్ అనిల్ (Brother anil) కొత్త పార్టీ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇది జగన్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. అందుకే జగన్ ముందుజాగ్రత్తగా ఈ మూడు వర్గాల్ని బుజ్జగించేలా కేబినెట్ లో వీరి సంఖ్యను అనూహ్యంగా పెంచేశారు అని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల విజయవాడ (Vijayawada)లో బ్రదర్ అనిల్ అనుచరులు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఇలాంటి అనుమానాలు రావడం సహజం. ఆ ప్రభావం సీఎం జగన్ కేబినెట్ కూర్పుపై పడింది అంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంలో అన్నివిధాలా అండగా నిలవడంతో పాటు తెరవెనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతు కూడగట్టారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. కానీ తాజాగా విశాఖ (Visakha)లో సమావేశం నిర్వహించిన బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ కు అండగా నిలిచిన వర్గాలను ఇప్పుడు అణచివేతకు గురవుతున్నాయని వ్యాఖ్యనించారు. అందుకే వారి సమస్యలు తాను వింటున్నాను అన్నారు. ఆ ప్రభావమే తాజా కేబినెట్ విస్తరణపై పడింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
త్వరలో జగన్ అడ్డాలో అనిల్ టూర్ ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలోనూ పర్యటించిన బ్రదర్ అనిల్ త్వరలో జగన్ కు గట్టిపట్టున్న రాయలసీమ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఎక్కువగా ఉన్న బీసీ జనాభాతో పాటు ఎస్సీ, ఎస్టీల్ని కూడా లక్ష్యంగా చేసుకుని అనిల్ ఈ పర్యటన చేయబోతున్నారు. ముఖ్యంగా వైసీపీకి తొలిసారి మొగ్గు చూపిన బీసీల్ని జగన్ కు దూరం చేయడంతో పాటు తమ పార్టీలో చేర్చుకునేందుకు అనిల్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు ఓ వర్గం ప్రచారం చేస్తోంది.
ముఖ్యంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఐఎఎస్, ఐపీఎస్ లు బ్రదర్ అనిల్ కుమార్ తో చర్చలు జరుపుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో బీసీ, ఎస్టీ, ఎస్టీ వర్గాల్ని వైసీపీకి అనుకూలంగా మార్చడంలో బ్రదర్ అనిల్ తెరవెనుక కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అవే వర్గాలు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయని అనిల్ అనుచరుల అభిప్రాయం. ఆ అసంతృప్తిని గమనించిన బ్రదర్ అనిల్ ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఓ కొత్త పార్టీ పెట్టి.. ఆ పార్టీకి సీఎం అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ విషయం సీఎం వరకు చేరడంతోనే ఇప్పుడు వైసీపీ బీసీ వర్గాలపైనే ఫోకస్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తాజా కేబినెట్ లో బీసీ, ఎస్సీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా అనిల్ కొత్త పార్టీపై రాయలసీమ టూర్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.