Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN NEW CABINET READY ROJA WILL TAKE CIVIL SUPPLY MINSTER AND OTHER PORT FOLIOS DECIDE NGS GNT

AP New Minsters: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..? రోజాకు ఏశాఖ ఇచ్చారంటే..? డీప్యూటీ సీఎంలు వీరే

రోజాకు ఏ శాఖ ఇచ్చారంటే..?

రోజాకు ఏ శాఖ ఇచ్చారంటే..?

AP New Minsters: సీఎం జగన్ తన ఎలక్షన్ టీంను రెడీ చేసుకున్నారు. ఇప్పటికే 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పాటు ఆయా మంత్రులకు పోర్టు ఫోలియోలు కూడా ఫిక్స్ చేశార.. ఏ మంత్రికి ఏ శాఖ ఇచ్చారంటే..?

  Anna Raghu, Amaravathi , News18.

  AP New Minsters:  ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఉత్కంఠ మధ్య కొత్త మంత్రుల ఎంపిక.. ప్రమాణ స్వీకారం పూర్తైంది.. ఆ ఉత్కంఠకు తెరదిగింది అంటే.. ఇప్పుడు ఏ మంత్రికి ఏ శాఖ కేటాయిస్తారు అన్నాదానిపై ఉత్కంఠ పెరుగుతోంది.అలాగే తాజా కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. అయితే, మంత్రులకు శాఖల కేటాయింపుపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఆయా మంత్రుల సీనియారిటీ ఆధారంగానే శాఖల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డినే కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో.. కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం లేని సమయంలో.. అన్నిటిపై పూర్తి అవగాహన ఉన్న బుగ్గనను తప్పించి కొత్తవారికి ఆ స్థానం ఇస్తే ఆర్థిక కష్టాలు మరింత రెట్టింపవుతాయని సీఎం జగన్ భావించారని తెలుస్తోంది. అందుకే మొదట బుగ్గనను కేబినెట్ నుంచి తప్పిస్తారని.. వేరే వారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో ఆయనను మంత్రిగా కొనసాగించారు. దీంతో ఆయనకు అదే శాఖ బాధ్యతలు అప్పగిస్తారన్నది స్పష్టమైంది.

  కేవలం ఆయన మాత్రమే కాదు.. సీనియర్ మంత్రులు సెకెండ్ టైం ఛాన్స్ దక్కించుకున్నవారికి పాత శాఖలే కేటాయించే అకాశం ఎక్కువ ఉంది. పాత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్‌, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఇక, కొత్తగా 14 మందికి అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌ను మంత్రులుగా ఇవాళ ఈ25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేశఆరు.

  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ధర్మాన ప్రసాదరావుకు పంచాయతీరాజ్ శాఖ, కాకానికి వ్యవసాయశాఖ కేటాయించే ఛాన్స్ ఉంది. రోజాకు పౌర సరఫరాల శాఖ, అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం, మైనార్టీ వెల్ఫేర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణాకు బీసీ వెల్ఫేర్ శాఖ, సీదిరి అప్పలరాజుకు మత్స్యశాఖ, విశ్వరూప్ కు సోషల్ వెల్ఫేర్, పెద్దిరెడ్డికి విద్యుత్, అటవీ, గనులశాఖ, అంబటి రాంబాబుకు సినిమాటోగ్రఫీ, బొత్స సత్యనారాయణకు మున్సిపల్ శాఖ, ఉషశ్రీకి మహిళా, శిశు సంక్షేమశాఖ కేటాయించినట్లు తెలుస్తోంది.

  అయితే వీరందరిలోను అధికంగా మంత్రి రోజా, అంబటి రాంబాబుల శాఖపైనే అందరి ఫోకస్ ఉంది. ఎందుకంటే రోజాకు హో్ం మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు టాక్.. అది కూడా గతంలో కొడాలి నాని నిర్వహించిన శాఖ అది.. ఇప్పుడు రోజాను మంత్రి వర్గంలోకి తీసుకున్నది కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేస్తూనే అన్నది వైసీపీ వర్గాల టాక్.. ప్రభుత్వ పరంగా ఆమె ఇకపై కొడాలి ప్లేస్ ను భర్తీ చేస్తారన్నదానికి సంకేతంగానే ఆ శాఖను ఆమెకు కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది.

  ఇక మాజీ మంత్రి పేర్ని నాని శాఖను అంబటి రాంబాబుకు కేటాయించారు. ముఖ్యంగా గత కేబినెట్ మంత్రిగా ఉన్న పేర్ని నాని.. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు.. పవన్ కు కౌంటర్లు ఇవ్వడంలో ఆయన ముందు ఉండేవారు. ఇప్పుడు ఆ శాఖను అంబటికి కేటాయించారు. అంటే పవన్ పై అంబటి బాణాన్ని సీఎం జగన్ సిద్ధం చేశారనే ప్రచారం ఉంది..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Rk roja

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు