Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN MOTHER YS VIJAYAMMA WILL TAKE DECISION ON RESIGNATION TO YCP HONORABLE PRESIDENT POST NGS

YS Vijayamma: వైసీపీకి విజయమ్మ రాజీనామా చేస్తున్నారా..? అధినేత జగన్ మనసులో మాట అదేనా..?

వైఎస్ విజయమ్మ రాజీనామా చేస్తారా..?

వైఎస్ విజయమ్మ రాజీనామా చేస్తారా..?

YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్హ మోన్ రెడ్డి కుటుంబ వ్యవహారాల్లో రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే చెల్లి షర్మిల.. అన్న వద్దని చెప్పినా.. తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు. ఇక బావ.. బ్రదర్ అనిల్ అయితే ఏపీలో క్రిస్టియన్, మైనార్టీ, బీసీ సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రచారం మొదలైంది. వైఎస్ విజయమ్మ.. వైఎస్ఆర్ పార్టీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా..?

ఇంకా చదవండి ...
    YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ (YS Family)ది ప్రత్యేక గుర్తింపు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. కుటుంబ వ్యవహరాలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. ఒక్కప్పుడు ఫ్యామిలీ అంతా ఒకే మాటపై కలిసి మెలిసి ఉండేవారు. కానీ వైఎస్ షర్మిల (YS Sharmila ) తెలంగాణ (Telangana)లో సొంతగా పార్టీ ఏర్పాటు చేయడంతో.. కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇటు షర్మిల, అటు సీఎం జగన్ అయితే ఈ వార్తలను ఖండించడం లేదు.. వైసీపీ నేతలు మాత్రం.. అన్న జగన్ కు చెల్లి షర్మిల్ తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం ఇష్టం లేదని.. ఈ విషయంలో విబేధాలు తప్ప.. అన్న చెల్లెళ్ల మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం.. కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ తీరును విమర్శించారు. అంతేకాదు ఆ తరువాత.. అన్న చెల్లి ఇప్పటి వరకు ఎదురెదుదు పడలేదు. కనీసం పుట్టిన రోజు సమయంలోనూ ఒకరికి ఒక శుభాకాంక్షలు చెప్పుకోలేదు. రాఖీ పండుగ రోజు కూడా అన్నా చెల్లి దూరం దూరంగా ఉన్నారు. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ (Brother Anil) సైతం ఏపీలో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన వరుసగా గత ఎన్నికల్లో జగన్ కు అనకూలంగా ఉన్న సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. జగన్ ను విమర్శిస్తున్నారు. దీంతో వైఎస్ కుటుంబంలో ఏదో జరుగుతోందనే సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షులు.. సీఎం జగన్ తల్లి విజయమ్మ (YS Vijayamma) రాజీనామా.. తన పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

    వైసీపీ వర్గాల్లోనే ఇప్పుడు విజయమ్మ రాజీనామా చేయబోతున్నారే వార్త ప్రచారంలో ఉంది. వైసీపీకి సీఎం జగన్ తల్లి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొడుకు, కూతురి మధ్య ఆమె నలిగిపోతున్నారని.. ఇద్దరిలో ఎవరి సపోర్ట్ చేయాలి అన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. కానీ ఇప్పటికే జగన్ సీఎంగా ఉన్నారు. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో షర్మిలకు రాజకీయంగా తాను అండగా ఉండడమే మంచిదని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వైసీపీకి విజయమ్మ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతోంది.

    ఇదీ చదవండి : ఏపీలో రామ్ చరణ్ కి డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్..

    ప్రస్తుతం విజయమ్మ ఎక్కువగా కుమార్తె షర్మిలతో ఉంటున్నారు. షర్మిల పాదయాత్ర లోనూ అక్కడక్కడా సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు సీఎం జగన్ తో కలిసి తల్లి విజయమ్మ పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్ పురస్కారాల ప్రధాన సభకు హాజరయ్యారు. అయితే, పార్టీ ఏర్పాటు సమయంలోనే జగన్ తన తల్లి విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రిజిస్ట్రేషన్ చేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే హోదాలో కొనసాగుతున్నారు ఆమె.

    ఇదీ చదవండి :: బీజేపీకి జై కొట్టడానికి కారణం అదేనా..? వైసీపీని టార్గెట్ చేస్తున్నారా..? మోహన్ బాబు ప్రచారాని అన్ని ఓట్లు వచ్చాయా..?

    కానీ ఇప్పుడు కుమార్తె షర్మిల వైఎస్సార్టీపీ ఏర్పాటు చేయటం... ఆ కార్యక్రమాల్లో అప్పడప్పుడూ పాల్గొంటున్న సమయంలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగటం సరి కాదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని విజయమ్మ తన కుమారుడు జగన్ వద్ద ప్రస్తావించి.. రాజీనామాకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే జూలై 8న జరిగే వైసీపీ ప్లీనరీ వరకూ కొనసాగాలని జగన్ కోరినట్లుగా సమాచారం. ఒకవేళ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తే.. ఈ వ్యవహారం వైసీపీలో సంచలనంగా మారే అవకాశం ఉంది. వైసీపీ ఏర్పాటు..తరువాత జగన్ జైలులో ఉన్న సమయంలోనూ... 2014, 2019 ఎన్నికల్లోనూ విజయమ్మ వైసీపీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. జగన్ అధికారంలోకి వచ్చే వరకూ తోడుగా నిలిచారు. జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారా..లేక, అటువంటి నిర్ణయం తీసుకోకుండా జగన్ చేస్తారా అన్నది చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Politics, Cm jagan, YS Vijayamma

    తదుపరి వార్తలు