హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Vijayamma: చాలాకాలం తరువాత జగన్ వెంట వైఎస్ విజయమ్మ.. ప్లీన‌రీ తరువాత రాజీనామా చేస్తారా?

YS Vijayamma: చాలాకాలం తరువాత జగన్ వెంట వైఎస్ విజయమ్మ.. ప్లీన‌రీ తరువాత రాజీనామా చేస్తారా?

వైఎస్ విజయమ్మతో జగన్ (ఫైల్)

వైఎస్ విజయమ్మతో జగన్ (ఫైల్)

YS Vijayamma: సీఎం జగన్ మోహన్ రెడ్డి, చెల్లి వైఎస్ షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి.. అమ్మ విజయమ్మ.. కొడుక్కి దూరంగానే ఉంటున్నారు. చాలా కార్యక్రమంలో షర్మిల వెంట ఉంటున్నారు తప్పా..? జగన్ తో ఏ కార్యక్రమంలో పాల్గొన్నది లేదు.. చాలా గ్యాప్ తరువాత ఆమె.. తొలిసారి ప్లీనరీలో పాల్దొంటున్నారు. అయితే ఈ ప్లీనరీ తరువాత ఆమె గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...

YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ (YS Family)ది ప్రత్యేక గుర్తింపు.  ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. కుటుంబ వ్యవహరాలు నిత్యం చర్చగానే ఉంటాయి. ఒక్కప్పుడు ఫ్యామిలీ అంతా ఒకే మాటపై కలిసి మెలిసి ఉండేవారు.  వైఎస్ షర్మిల (YS Sharmila ) తెలంగాణ (Telangana)లో సొంతగా పార్టీ ఏర్పాటు చేయడంతో.. కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు బయట ప్రపంచానికి తెలిసాయి.. తరువాత పలు సందర్భాల్లో.. కలుసుకున్నా.. ఇద్దరూ మాట్లాడుకున్నది లేదు.  కనీసం పుట్టిన రోజు సమయంలోనూ ఒకరికి ఒక శుభాకాంక్షలు చెప్పుకోలేదు. రాఖీ పండుగ రోజు కూడా అన్నా చెల్లి దూరం దూరంగా ఉన్నారు. ఇటీవల షర్మిల భర్త బ్రదర్ అనిల్ (Brother Anil) సైతం ఏపీలో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇలా గ్యాప్ ఉన్న సమయంలో రేపు ఇడుపుల పాయలో ఇద్దరు అన్నా చెల్లుల్లు కలుస్తున్నారు. మరోవైపు చాలా రోజు తరువాత తొలిసారి సీఎం జగన్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ విజయమ్మ..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 8,9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు శరవేగంగా పూర్తవుతున్నాయి. వైసీపీ ప్లీనరీకి ఆ పార్టీ నాయ‌కురాలు విజయమ్మ హాజ‌ర‌వుతారా? లేదా? అన్న సందేహాలు ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉన్నాయి. అయితే ఆ అనుమానాలకు తెరదించుతూ.. ఆమె వ‌స్తున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. రెండవ రోజు ప్లీనరీలో విజ‌య‌మ్మ ప్రసంగించనున్నారు. ఉదయం 10 నుంచి 10.30 గంట‌ల వర‌కు ఆమె ప్రసంగిస్తారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు విజ‌య‌మ్మ‌ దూరంగా ఉంటున్నారు. విజయమ్మ వస్తారా? రారా? అని నిన్నటి వరకూ పార్టీలో చర్చ జ‌రిగింది. విజయమ్మ ప్లీన‌రీకి వస్తున్నారని తెలియడంతో పార్టీ క్యాడర్‌లో జోష్ నిండింది. అయితే ప్లీనరీ తరువాత ఆమె సంచలన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది..

ఇదీ చదవండి : వైసీపీ ప్లీనరీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ.. సమావేశాల షెడ్యూల్ ఇదే..

ప్రస్తుతం వైసీపీకి సీఎం జగన్ తల్లి విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కొడుకు, కూతురి మధ్య ఆమె నలిగిపోతున్నారని.. ఇద్దరిలో ఎవరి సపోర్ట్ చేయాలి అన్నదానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. కానీ ఇప్పటికే జగన్ సీఎంగా ఉన్నారు. తనకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో షర్మిలకు రాజకీయంగా తాను అండగా ఉండడమే మంచిదని ఆమె భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా వైసీపీకి విజయమ్మ దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ప్లీనరీకి ముందే ఆమె పార్టీ పదవికి రాజీనామా చేస్తే చెడు సంకేతలు వెళ్లే అవకాశం ఉందని.. అది వైసీపీపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అందుకే.. ప్లీనరీ వరకు కొనసాగాలని జగన్ కోరినట్టు గతంలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్లీనరీ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఆమె రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, YS Vijayamma

ఉత్తమ కథలు