హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking News: ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్.. 27 మందికి క్లాస్.. పేర్లు కూడా ప్రకటించిన జగన్

Breaking News: ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్.. 27 మందికి క్లాస్.. పేర్లు కూడా ప్రకటించిన జగన్

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

Breaking News: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు.. ఎన్నికల సమయానికి తీరు మారకపోతే.. కఠిన నిర్ణయాలు తీసుకుంటాను అన్నారు. ఆ నేతలు ఎవరంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Breaking News: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీరయిస్ అయ్యారు. 175 స్థానాలే టార్గెట్ గా అడుగులు వేస్తున్నఆయన.. దాదాపు 27 మందికి క్లాస్ పీకినట్టు సమాచారం. అలాగే ఆ 27 మంది పేర్లు కూడా చదవి వినిపంచి.. ఇదే లాస్ట్ వార్నింగ్ అని హెచ్చరించినట్టు తెలుస్తోంది. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోమని చెప్పినా.. కొంతమంది నేతలు కాలక్షేపం చేస్తున్నారని జగన్ మండిపడినట్టు తెలుస్తోంది. మళ్లీ నవంబర్ లో  సమావేశం నిర్వహిస్తామని.. అప్పటికి తమ పని తీరు మెరుగు పరుచుకోవాలని డెడ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. మంత్రులు తానేటి వనిత (Taneti Vanita), బుగ్గన (Buggana) లకు సైతం సీఎం జగన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  సీఎం జగన్ క్లాస్ పీకిన వారిలో ఎక్కువగా మంత్రులు, మాజీ మంత్రులే ఉండడం విశేషం.. అయితే పూర్ పెర్ఫార్మెన్స్ విషయంలో మంత్రి రోజాకు కూడా క్లాస్ పీకినట్టు సమాచారం. ఇక మాజీ మంత్రుల జాబితాలో కొడాలి నాని , బాలినేని,  ఆళ్లనాని ఉన్నట్టు సమాచారం. ఇప్పటికైనా మీరంతా పని తీరు పెంచుకుంటే మంచిది అని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం..

  మరో ఆరు నెలల్లో పని తీరు మెరుగుపరుచుకోకుంటే.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని వార్నింగ్ ఇచ్చారు. మనం 175 సీట్లు గెలవాలి అంటే నాతో పాటు.. అందరూ కష్టపడి పని చేయాలని జగన్ సూచించినట్టు సమాచారం. మీ అందరిపైనా ప్రేమ ఉంది. అందుకే ఒక్కరిని కూడా పోగొట్టుకునే ఉద్దేశం తనకు లేదని చెప్పారని తెలుస్తోంది. అందుకే పని తీరు మెరుగుపరుచుకోమని పదే పదే చెబుతున్నాను అన్నాట్టు వైసీపీ వర్గాల త్వారా తెలుస్తోంది.

  ఇదీ చదవండి : ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఈ సమావేశం తరువాత మాట్లాడిన వైసీపీ నేతలు మాత్రం.. ఎవరూ పేరు సీఎం ప్రస్తావన తేలేదు అన్నారు. ఒక 27 మంది నేతల తీరు బాగులేదని.. వచ్చే నవంబర్ సమావేశం నాటికి పని తీరు మెరుగు పరుచుకోవాలని మాత్రమే చెప్పారని.. అయితే పని తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఒక పాజిటివ్ వేలోనే ఆయన తమకు చెప్పారని అంటున్నారు.

  ఇదీ చదవండి : అనంతపురంలో మెగా కోలాహలం.. ఉదయం నుంచే సందడి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  ఈ సమావేశం సందర్భంగా కీలక అంశ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని .. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడ్ని పోట ీచేయించాలి అనుకుంటున్నట్టు సీఎం కు చెప్పినట్టు తెలుస్తోంది. తన కొడుకే ప్రస్తుతం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చూస్తున్నట్టు చెప్పారని.. దానిపై సీఎం సానుకూలంగానే స్పందించారని అంటున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు