Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN MOHAN REDDY RESLEASED FUNDS FOR WHO NOT GET WELFARE SCHEMES IN AP NGS GNT

CM Jagan: ఇప్పటి వరకు పథకాలు అందని వారికి శుభవార్త.. 3.39 లక్షల మందికి లబ్ధి.. నిధులు విడుదల చేసిన సీఎం

లబ్ధి దారులకు సీఎం జగన్ శుభవార్త

లబ్ధి దారులకు సీఎం జగన్ శుభవార్త

CM Jagan: అధికారం అంటే అజమాయిషీ కాదు అన్నారు సీఎం జగన్. ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని అభిప్రాయపడ్డారు. అందుకే అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారిని ప్రత్యేకంగా గుర్తించి.. వారందరికీ లబ్ధి చేకూరేలా.. వారికి నగదు అందించారు.

ఇంకా చదవండి ...
    CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు మరో శుభవార్త అందించారు సీఎం జగన్ (CM Jagan).. రాష్ట్రంలో వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేశారు. అన్నిఅర్హతలు ఉండి.. ఇతర కారణాలతో సంక్షేమ పథకాలకు (Welfare Schemes) దూరమైన వారికి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 పథకాల్లో కొత్తగా 3,39,096 మంది లబ్ధిదారులకు, కంప్యూటర్ బటన్ నొక్కి 137 కోట్ల రూపాయలు జమ చేశారు. కొత్తగా 3.39 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్రంలో వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం (CM Jagan) మరోసారి స్పష్టం చేశారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్య శ్రీ కార్డులు (Arogyasri Cards) మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా 2,99,085 మందికి పెన్షన్ కానుక అందించారు. అలాగే ఏటా పెన్షన్ కానుక అదనపు సహాయం పెంచుతామని వివరించారు. పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక కాగా.. ఈ పథకాల కోసం నిధులను సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల చేస్తున్నామన్నారు.

    దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కొత్త లబ్ధిదారుల కోసం 137 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదన్నారు.



    ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన 3,39,096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్‌ వెల్లడించారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం.

    ఇదీ చదవండి : 11 మంది కాదు.. అంతకుమించే? నిత్య పెళ్లికొడుకు కేసులో నమ్మలేని నిజాలు ఎన్నో?

    గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. అలాగే త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి దారులకు నగదు విడుదల చేయనున్నారు సీఎం జగన్. వైయస్సార్‌ కాపు నేస్తం- జూలై 22న, జగనన్న తోడు–జులై 26వ తేదీన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గం (AP Cabinet) గతంలోనే నిర్ణయించింది. అలాగే ఏపీలోని విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి అనేక చర్యలు తీసుకొంటున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్ధులకు ట్యాబ్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా.. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు సీఎం జగన్‌ సున్నితంగా హెచ్చరిక చేశారు. ప్రజల్లో గ్రాఫ్‌ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని ఆదేశాలు జారీ చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap government, Ap welfare schemes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు