హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

I-PAC Survey: సీఎం చేతికి ఐ ప్యాక్ సర్వే.. టాప్ లో ఉన్నది ఎవరు? ఈ ఐదు అంశాలపై క్లారిటీ?

I-PAC Survey: సీఎం చేతికి ఐ ప్యాక్ సర్వే.. టాప్ లో ఉన్నది ఎవరు? ఈ ఐదు అంశాలపై క్లారిటీ?

సీఎం జగన్ సంచలన నిర్ణయం

సీఎం జగన్ సంచలన నిర్ణయం

I-PAC Survey: అధికార వైసీపీ నేతల్లో మళ్లీ గుబులు మొదలైంది.. తాజాగా ఐప్యాక్ టీం చేసిన సర్వే రిపోర్ట్ సీఎం చేతికి చేరింది. ఐదు అంశాల వారిగా ఈ సర్వే చేశారు..? మరి ఈ సర్వేలో ఏముంది.. ఎమ్మెల్యేలను ఎందుకు టెన్షన్ పెడుతోంది.. ఐదు అంశాల వారిగా సాగిన ఈ సర్వేలో.. టాప్ లో ఉన్నది ఎవరు..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

I-PAC Survey: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ మొదలైంది. అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుని పరిస్థితులను సమీక్షించుకుంటున్నాయి. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి.. ఐప్యాక్ టీమ్ (I Pac Team) తన తాజా సర్వే రిపోర్ట్ (Latest Report) ను  అందించినట్టు సమాచారం. ఈ రిపోర్ట్ లో ముఖ్యంగా ఐదు అంశాలను పొందు పరిచినట్టు తెలుస్తోంది. ఐదు అంశాల వారీగా 175 నియోజకవర్గాల్లో పరిస్థితిని స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం.

తాజా నివేదిక తరువాత.. వైసీపీ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైంది. ఎవరి జాతకం ఏంటి అన్నది అందులో ఉందని మదన పడుతున్నారు. అయితే తాజా రిపోర్ట్ అధారంగా.. సీఎం జగన్ ఈ వారంలోనే ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు.. అంతా రానున్నారు. అందుకే ఈ శనివారమే.. నేతలు అందరితో సమావేశమై.. రిపోర్ట్ వారి ముందు పెట్టి ఫైనల్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

ముఖ్యంగా ఐదు అంశాల వారిగా ఈ రిపోర్ట్ తయారు చేసినట్టు టాక్. అందులో మొదటిది గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ఎలా సాగుతోంది. ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలతా ఇంటరాక్ట్ అయ్యారు అన్న అంశాలపై రిపోర్ట్ లో వివరించారు.

ఇదీ చదవండి : అధినేత క్లాస్ పీకినా మారని తమ్ముళ్లు.. కంటతడి పెట్టుకున్న బుద్దా వెంకన్న.. ఏం జరిగింది?

ఇక రెండోది సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు.. వాటిపై ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మూడోది గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు.. నాలుగోది ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి నేతల బలం ఎంత..? టీడీపీలో ఉన్న గ్రూపులు.. ప్రస్తుతం వారి పని తీరు ఎలా ఉంది అన్నాదానిపై నివేదిక రూపొందించారు. ఇక ఐదవది వైసీపీ ఇంఛార్జుల పని తీరు.. ఎక్కడ అదనపు ఇంఛార్జులు పెట్టాలి.. లేదా అబ్జర్వర్లను పెట్టాల్సిన అవసరం ఉందా అన్నదానిపై రిపోర్ట్ తయారు చేశారు.

ఇదీ చదవండి : ఈనెల 22న వైయ‌స్ఆర్ చేయూత.. చంద్రబాబు అడ్డా నుంచి ప్రారంభం.. అర్హులు ఎవరంటే..?

ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? వారి పనితీరు ఎలా ఉంది? అనే దానిపై ఐప్యాక్ టీమ్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. టాప్ టెన్ లో ఎంతమంది ఉన్నారు? ఎక్కువ రోజులు గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించిన ఎమ్మెల్యే ఎవరు? చాలా తక్కువ రోజులు ఈ కార్యక్రమం నిర్వహించిన వారు ఎవరు? అనే దానిపై పూర్తి స్థాయి నివేదిక ఐప్యాక్ టీమ్ సీఎం జగన్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానిపై రోజువారీ సర్వేలు చేయించారు. ప్రత్యేకంగా ఐప్యాక్ టీమ్.. నియోజకవర్గాల వారీగా సీక్రెట్ గా దీనికి సంబంధించిన సర్వే చేస్తోంది.

ఇదీ చదవండి : జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. అక్రమ సంబంధం వెనుక అసలు కథ.. తెలిస్తే షాక్

టాప్ లో ఉన్నది వీరే..

ఐప్యాక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో అతి తక్కువ మందే వందుకు వందశాతం కష్టపడ్డారన్న అంశాన్ని స్పష్ల చేశారు. అందులో అందరికంటే ఎక్కువగా నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అధికంగా వంద రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఎక్కువమంది ప్రజలను కలిశారని నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది. ఇక పర్చూరి ఇంఛార్జ్ రావి రఘునాథం కూడా గడప గడపకు ప్రభుత్వంలో బాగా తిరిగారని చెప్పినట్టు సమాచారం. ఇక పరచూరి ఇంఛార్జ్ బాచిన చెంచు గర్తయ్య.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వీరు మాత్రమే 100 రోజులు గడప గడపలో పాల్గొన్నారని.. ఇతరుల కంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లారని నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి : దేశమంతటా గణేష్‌ నిమజ్జనాలు ముగిశాయి.. ఈ గణపయ్యను మాత్రం విసర్జన చేయలేదు.. ఎందుకో తెలుసా?

అయితే చాలామంది ఎమ్మెల్యే వ్యతిరేకంగానే నివేదిక ఉన్నట్టు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పినట్టు సమాచారం. దీనిపై గతంలోనే ఓసారి ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. వచ్చే ఎన్నికలకు కొంతమంది సిట్టింగ్ లను మారుస్తారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో మరోసారి.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన సర్వే సీఎం చేతికి అందింది. దీంతో తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంటుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. తమ పనితీరుకు ఎన్ని మార్కులు పడ్డాయోనని వర్రీ అవుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

ఉత్తమ కథలు