హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఇక పూర్తి టైం పార్టీకే.. ప్రజల్లోకి నేరుగా జగన్.. ముహూర్తం ఫిక్స్.. ఎన్నికల పైనా క్లారిటీ ఇస్తారా..?

CM Jagan: ఇక పూర్తి టైం పార్టీకే.. ప్రజల్లోకి నేరుగా జగన్.. ముహూర్తం ఫిక్స్.. ఎన్నికల పైనా క్లారిటీ ఇస్తారా..?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: సీఎం జగన్ తన టార్గెట్ 175 అంటున్నారు.. అది సాధ్యమేనా..? ఆయన మాత్రం అదే కాన్ఫిడెన్స్ తో ఇక జనంలోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారా..? దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారా..? అలాగే నేరుగా ప్రజల్లోనే ఎన్నికలు ఎప్పుడు అన్నది కూడా క్లారిటీ ఇస్తారా..?

ఇంకా చదవండి ...

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. మరోసారి అధికారం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో సునామీ విజయం సాధించిన ఆయన.. ఈ సారి 175 సీట్లలో గెలుపొందడమే తన టార్గెట్ అంటున్నారు. అదే మాట పదే పదే చెబుతున్నారు.  ఆ లక్ష్యం చేరుకోవాలి అంటే.. తాను పూర్తిగా పార్టీపై పట్టు సాధించాలని.. అందుకే ఇకపై పార్టీకే అధిక సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ముహూర్తం సైతం దాదాపుగా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ప్రతీ వారం ఒక్కో ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్లి.. వారితో మమేకం అయ్యేలా ఒక ప్రణాళిక సిద్దం చేసారు. కానీ, వరుసగా రెండేళ్ల పాటు కరోనా వైరస్ (Corona Virus)  రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. అందుకే ఆయన ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గడంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లడానికి ఆయన సిద్ధమైనట్టు టాక్. మరోవైపు ఏపీలో మరో ప్రచారం కూడా జరుగుతోంది.. ముందస్తు ఎన్నికలు ఖాయమైన విపక్షాలు గట్టి నమ్మకంగా చెబుతున్నాయి. అధికార పార్టీ మాత్రం ఎన్నికలపై క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే జగన్ ఈ సారి ఎన్నికలపై నేరుగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

  దాదాపు అన్ని పార్టీలు త్వరలో ప్రజా బాట పట్టాలని ఫిక్స్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. గతంలో తన తండ్రి నిర్వహించిన మీ కోసం పేరుతోనే లోకేష్ (Lokesh) యాత్ర కొనసాగనుంది. ఇక దసర సందర్భంగా అంటే అక్టోబర్ 5 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సైతం ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఆయన ఆరు నెలల పాటు అన్ని జిల్లాలోనూ బస్సు యాత్రలు చేయనున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ సైతం ప్రజల్లోకి వెళ్లి తన పాలన పైన స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకోవటంతో పాటుగా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్దం అవుతున్నారు.

  2017లో పాదయాత్ర ప్రారంభించిన తేదీ నుంచే ఇప్పుడు రచ్చబండకు సిద్ధమవుతున్నట్టు టాక్. 2024లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న ఆయన ప్రతీ రోజు రెండు లేదా మూడు నియోజకవర్గాలకు చెందిన లబ్ది దారులతో సమావేశం కానున్నారని సమాచారం. అలాగే నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలతో పార్టీ పరంగా సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. అదే సమంలో పని చేసే అభ్యర్థులపైనా ఆరా తీసి.. టికెట్లపై ముందుగానే సమాచారం ఇస్తారని తెలుస్తోంది.

  ఇదీ చదవండి : అట్టహాసంగా ఊరేగింపుతో పెళ్లికి వెళ్లాలి అనుకుంది.. కానీ వరద నీటిలో పడవలో వెళ్లిన పెళ్లికూతురు

  ఈ జిల్లా స్థాయి సమీక్షల్లోనే అభ్యర్థులను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. వారంలో మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటనలు - సమీక్షలు జరిగే విధంగా ప్రణాళిక సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లోగా ఈ పర్యటనలు పూర్తి చేసి ఎన్నికలకు స్పష్టమైన కార్యచరణ ప్రకటన దిశగా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు. సీఎం జగన్ క్షేత్ర స్థాయి పర్యటనల తరువాత.. ఎన్నికలపైనా క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

  ఉత్తమ కథలు