హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Bumper Offer: చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్ బంపర్ ఆఫర్.. మంత్రి పదవిపై హామీ.. ఇంకా ఏం చెప్పారంటే?

CM Jagan Bumper Offer: చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్ బంపర్ ఆఫర్.. మంత్రి పదవిపై హామీ.. ఇంకా ఏం చెప్పారంటే?

 సీఎం జగన్ ఫైల్

సీఎం జగన్ ఫైల్

CM Jagan Bumper Offer: చంద్రబాబు ప్రత్యర్థికి సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు.. ఆయన రాజకీయాలకు కొత్త.. అందులోనే ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం కూడా లేదు.. అయినా మంత్రి పదవి ఇస్తానంటూ భరోసా ఇచ్చారు.. ఆపరేషన్ కుప్పంలో భాగంగా.. ఆయన ఏం హామీ ఇచ్చారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

CM Jagan Bumper Offer: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై పూర్తి ఫోకస్ చేశారు.. ఇప్పటికే ఆపరేషన్ కుప్పం (Kuppm) చేపట్టిన ఆయన.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఇటీవల తెప్పించుకున్న నివేదిక ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం.. టీడీపీ కంచుకోటపై ప్రత్యేక ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బ తీయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకే ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమంటూ ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం.. అందులో భాగంగా కుప్పాన్ని ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా.. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజే కుప్పం నియోజకవర్గం నుంచే ఆయన తన సమీక్షలు ప్రారంభించారు. తాజాగా ఆయన కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన 60 మంది కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి ఎవరో స్పష్టం చేయడంతో పాటు.. ఆయనకు.. అలాగే కుప్పం వైసీపీ నేతలపై వరాల జల్లు కురిపించారు. బంపర్ ఆఫర్లు ప్రకటించారు.

కార్యకర్తలతో ఆయన ఏం చెప్పారంటే..? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందని గుర్తు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని కార్యకర్తలకు స్పష్టం చేశారరు. ఇది తన సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ (Barath)ను కనుక మీరు గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం గ్యారెంటీ అన్నారు.

కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి 65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నామన్నారు.  అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటమని భరోసా ఇచ్చారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేలా సీఎం జగన్‌.. దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. కుప్పం అంటే టీడీపీకి ఒక కంచుకోట అని అంతా అనుకుంటారని.. కానీ వాస్తవం ఏంటంటే.. బీసీలు ఎక్కువగా ఉన్న స్థానం కుప్పం నియోజకవర్గమే అని గుర్తు చేశారు.  

మన ప్రభుత్వం బీసీలకు మంచి చేస్తోంది అన్నారు. అది ప్రతి పనిలోనూ కనిపించాలి అన్నారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంచి వ్యక్తి, ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళిని అభ్యర్థిగా పెట్టి మనం అడుగులు ముందుకేశామని. కానీ దురదృష్టవశాత్తూ చంద్రమౌళి మనకు దూరమయ్యారని కాసేపు ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే ఆ కుటుంబాన్ని వదిలేయకుండా.. ఆయన కుమారుడు భరత్‌ను తీసుకు వచ్చామన్నారు. చంద్రమౌళి చికిత్స పొందుతున్న సమయంలో తాను ఆస్పత్రికి కూడా వెళ్లానని.. ఆ రోజే భరత్‌ తనకు పరిచయం అయ్యాడన్నార. అప్పుడు భరత్‌ను ప్రోత్సహిస్తానని చెప్పాను అన్న విషయం కార్యకర్తలకు వివరించారు.

ఇదీ చదవండి : సీఎం ఔదార్యం.. జనం మధ్య నుంచి మహిళ అరుపులు.. వెంటనే స్పందించి త‌ల్లి స‌మ‌స్యకు ప‌రిష్కారం

వైసీపీ కార్యకర్తలంతా భరత్‌పై అదే ఆప్యాయతను చూపించినందుకు ఆనందంగా ఉంది అన్నారు. అందుకే అక్కడ భరత్‌ నిలదొక్కుకున్నాడని.. మరి భరత్‌ను ఇదేస్థానంలో నిలబెడతారా..? పై స్థానంలోకి తీసుకు వెళ్తారా? అన్నది కార్యకర్తలపైనే ఆధారపడి ఉందన్నారు. మీరు భరత్‌ను గెలుపించుకు రండి.. భరత్‌ను మంత్రిగా మీ కుప్పానికి ఇస్తాను అని జగన్ భరోసా కల్పించారు. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారు, ఆయన సీఎం అవుతారు, తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భ్రమను టీడీపీ, చంద్రబాబు కల్పించుకుంటా వెళ్లారని.. ఇప్పుడు ఆ భ్రమలు తొలగడంతో ప్రజలు.. మనకు మద్దతు ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kuppam

ఉత్తమ కథలు