CM Jagan on Three Capital: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాల్లో పాలన వికేంద్రీ కరణపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. ఈ సంరద్భంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ఒకే రాజధానిగా అమరావతి (Amaravati) సాధ్యమా అని విపక్షాలను ప్రశ్నించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే.. మూడు రాజధానుల (Three Capitals) ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా అని తీవ్రంగా విమర్శించారు. 1956-2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదని.. రాష్ట్రం విడిపోతున్నా.. విభజిత ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నప్పుడు చంద్రబాబు ఒక్క రోజైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు.
పరిపాలన వికేంద్రీకరణ కోసం మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలని ప్రశ్నించారు. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ ఫైర్ అయ్యారు.
ఇదీ చదవండి : వాట్ యాన్ ఐడియా..! బుల్లెట్ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?
చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి అని ప్రశ్నించారు. బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం. మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వమని.. ప్రతిపక్ష పార్టీలో కూడా తన మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం అంటూ చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి : శ్మశానాన్ని కేరాఫ్ గా మార్చుకున్న దొంగ.. ఫోన్ సహా ఎలక్ట్రానిక్ వస్తువులే వాడడు
అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అమరావతిలో ఎకరాకు రూ.2కోట్ల చొప్పున ఖర్చవుతుందని బాబే చెప్పారు. అమరావతిలో కేవలం 8 కిమీటర్ల పరిధిలో 53 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాలకు లక్షా 10వేల కోట్లు అవుతందని చంద్రబాబే చెప్పారు. రాజధాని కోసం అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టలేకపోయారు. అయితే తమ ప్రభుత్వం అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడం లేదన్నారు. విశాఖ, కర్నూలులో కూడా రాజధానులు పెడతామని మాత్రంమే చెప్పామన్నారు.
ఇదీ చదవండి : వాట్ యాన్ ఐడియా..! బుల్లెట్ బార్బిక్యూ.. ఇంకా ప్రత్యేకత ఏంటంటే..?
వికేంద్రీకరణ అనేది కేవలం రాజధానికి మాత్రమే కాదు. పరిపాలన అందరికీ అందాలన్నా వికేంద్రీకరణ అవసరం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడైనా గ్రామసచివాలయాల గురించి ఆలోచించారా?. ఒక్కో సచివాలయంలో ప్రస్తుతం 600 రకాల సేవలు అందుతున్నాయి. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్ల ఏర్పాటు చేశాం. గత 75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే మేం వచ్చాక కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. అధికార వికేంద్రీకరణ అంటే ఇది. అధికార వికేంద్రీకరణ వల్లే వరద బాధితులకు సాయం చేయగలిగామన్నారు.
ఇదీ చదవండి : నిజమే టీడీపీ నుంచే వచ్చాం.. నాని భాష సరైందే..? లోకేష్ ను కొట్టిస్తానంటూ మంత్రి రోజా వార్నింగ్
ప్రస్తుతం అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు చంద్రబాబే స్పాన్సర్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లూ రావని చంద్రబాబుకు తెలుసన్నారు. అందుకే ఇలా పాదయాత్రను స్పాన్సర్ చేస్తోంది చంద్రబాబే అని ఆరోపించారు. బుద్ది ఉన్న వ్యక్తి ఎవరూ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టరు అన్నారు. పెట్రోల్, డీజిల్ పోసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, AP News