హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూర్ వెళ్లాలా..? ఏపీ మెడికల్ హబ్ అవుతుందన్న సీఎం జగన్

CM Jagan: వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూర్ వెళ్లాలా..? ఏపీ మెడికల్ హబ్ అవుతుందన్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫొటో)

పేదవాడికి కార్పొరేట్ స్థాయి చికిత్స అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్.. అలాగే భవిష్యత్తులో చికిత్స కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లకుండా చేస్తామన్నారు. ఎక్కడి వారికి అక్కడే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు.

ఇంకా చదవండి ...

  ఏపీని మెడికల్ హబ్ గా తయారు చేస్తాను అన్నారు సీఎం జగన్.. భవిష్యత్తులో వైద్యం కోసం పొరుగు ప్రాంతాలవైపు పరుగులు తీయకుండా ఎక్కడికక్కడే వైద్యం అందేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యంగా ఇటీవల కరోనా చికిత్స కోసం చాలామంది హైదరాబాద్ వెళ్లేందుకు యత్నించడం.. అనుమతులులేవని బోర్డర్ లో తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను సైతం నిలిపివేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఇకపై ఏపీలోనే అన్ని వైద్య సదుపాయాలు అందేలా చేయడంపై సీఎం జగన్ ఫోకస్ చేశారు.. ఏపీని హెల్త్ హబ్ గా మారుస్తానని జగన్ మరోసారి స్పష్టం చేశారు. అత్యాధునిక వసతులతో ఆస్పత్రుల నిర్మాణం చేపడతామన్నారు.

  ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు.

  ఈ సందర్భంగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు సీఎం జగన్. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు.

  ఇదీ చదవండి:  ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌... CCRAS నివేదికలో ఏముందంటే?

  మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు దాదాపు 8వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. పేదవారికి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుకొండ, నంద్యాల, ఆదోని, పాడేరు, పులివెందులలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు

  ఇదీ చదవండి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. సండలింపులపై సీఎం జగన్ ఏమన్నారంటే?

  మెడికల్‌ కాలేజీలతో పాటు 500 పడకల ఆస్పత్రులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నామన్నారు.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలను తీసుకొస్తున్నాం.  246 కోట్ల రూపాయలతో గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.  వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో గణనీయమైన మార్పులు చేశామన్నారు. 2,436 చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు.  వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశాన్నారు.

  ఇదీ చదవండి: పెళ్లి ఫోటో షూట్ కోసం వెళ్లిన ముగ్గురు స్నేహితులు.. కానీ ఊహించని విషాదం

  కోవిడ్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చామని.. రెండేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా రూ.5,215 కోట్లు చెల్లించామని సీఎం జగన్‌ తెలిపారు. 1180 వాహనాలు 108, 104లను అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం జగన్‌ తెలిపారు.కోవిడ్‌ సమయంలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా ఉండి మరణించిన వారికి కేంద్రం స్కీం వర్తించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు అందజేస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Aarogyasri, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, Ysr cp

  ఉత్తమ కథలు