AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అయితే.. 175కి 175 సీట్లే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అదే విషయాన్ని నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్నికల నినాదం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికలను అమరావతి (Amaravati) వర్సెస్ మూడు రాజధానులు (Three Capitals)గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.. మరో ఛాన్స్ ఇవ్వండి మూడు రాజధానులు నిర్మిస్తాం.. పరిపాలణ వికేంద్రీ కరణ తమ లక్ష్యం అని చెప్పి.. మూడు ప్రాంతాల ప్రజలను ఓట్లు అడగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇటీవల సీఎం జగన్ వ్యాఖ్యలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వికేంద్రీకరణ ధోరణులను ప్రజలు వ్యతిరేకించారని, మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దని.. అలాంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడకూడదని ప్రజలు తీర్పు ఇచ్చారని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇంతలా వైఎస్ జగన్ ఫిక్స్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? అంటే.. ఆ నినాదం వైసీపీకి బాగా బూస్ట్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
గతంలో పాదయాత్రలతో ప్రజల్లోనే గడిపిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేం అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు అమలు చేస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికార పీఠాన్ని అధిరోహించారు. ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు.. మూడు రాజధానుల నినాదంతో 2024లో తిరిగి పవర్లోకి రావాలన్నది జగన్ ప్లాన్‌గా ఉందట.. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు అని ఎన్నికల బరిలోకి దిగితే.. వాళ్ల టార్గెట్ 175కి 175 సాధ్యం కాదన్న భావనతో.. ‘మూడు రాజధానులు’ అనే సెంటిమెంట్‌ను వాడుకోవాలని భావిస్తున్నారట.. మూడు రాజధానుల సెంటిమెంట్ కచ్చితంగా వర్కవుట్ అవుతుందని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.
ఇదీ చదవండి : గాడిద మాంసానికి ఏపీలో ఫుల్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే..?
గత ఎన్నికల్లోలాగా కాకుండా.. ఈ సారి విపక్షాలు అన్నీ ఏకమయ్యే అవకాశం ఉన్నందున.. ఉమ్మడిగా వచ్చినా విపక్షాలను కట్టడి చేయాలంటే ఇదే సరైన నినాదమని భావిస్తున్నారని సమాచారం. దీనికి ప్రధాన కారణం.. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు అమరావతి రాజధాని అనే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని.. తను తెప్పించుకున్న సర్వేల్లో ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్న మాట. అదే సమయంలో మూడు రాజధానులు అంటే తమ ప్రాంతంలో ఏదో ఒక రాజధాని వస్తుందనే ఆశతో ఎక్కువ శాతం ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలో కొంత వ్యతిరేకత ఉన్నా.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో మాత్రం.. ఇది అధికార పార్టీకి బాగా కలిసివచ్చే అంశంగా ఉందంటున్నారు.
ఇదీ చదవండి : గాడిద మాంసానికి ఏపీలో ఫుల్ డిమాండ్ పెరగడానికి కారణం ఇదే..?
మరోవైపు అమరావతిని రాజధానిగా తీసివేయడం లేదని వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది... కేవలం పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా… ఇతర సమావేశాల్లోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు.. మంత్రులు కూడా స్పష్టంగా చెబుతూ వస్తున్నారు. అమరావతి పరిశర ప్రాంతాల్లో ఉండే వైసీపీ నేతలు.. ఈ విషయాన్ని అక్కడి ప్రజలకు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: భక్తులతో కిటకిట లాడుతున్న ఏడుకొండలు.. సర్వదర్శనంకు ఎంత సమయం పడుతోంది అంటే?
విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జేఏసీ తలపెట్టిన విశాఖ గర్జన సభకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ సభ బాధ్యతను మొత్తం తన భుజాలపై వేసుకునొ విజయవంతం చేసింది.. రాష్ట్ర మంత్రులతో పాటు, వైసీపీ నేతలు ఈ సభలో పాల్గొన్నారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం కాకుండా.. రాయలసీమలోనూ వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో తిరుపతి వేదికగా.. ర్యాలీ, సభ నిర్వహించారు.. సీమలోని మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తమ ప్రాంతంలో ఓ రాజధాని ఏర్పాటు కావాల్సిందే అని గొంతెత్తి చాటుతున్నారు..
ఇదీ చదవండి : పవన్ పోటీ చేసే ప్లేస్ ఏది..? పిఠాపురమా? భీమవరమా? జనసేనాని మనసులో ఏముంది..?
ఇప్పటికే 2024 ఎన్నికలు మూడు రాజధానులు వర్సెస్ అమరావతిగా ఉండబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పకనే చెప్పారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట.. గత ఎన్నికలో నవరత్నాలు వైసీపీకి అధికారాన్ని తెచ్చిపెడితే.. అప్పుడు ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 98 శాతం పూర్తి చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను కూడా తీసుకువస్తున్నారు.. దీనికి తోడు మూడు రాజధానుల వ్యవహారం అధికార పార్టీకి అన్ని విధాలుగా కలిసిరాబోతోందని అంచనా వేస్తున్నారు. వైసీపీ ఈ నినాదం అందుకున్నట్టు తరువాత 10 శాతానికి పైగా ప్రభావం ఉందని అంచానా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, AP Three Capitals