హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సీఎం క్లాస్ పీకిన ఆ 27 మంది ఎవరు? నలుగురు మంత్రలు, మాజీ మంత్రులు కూడా..

CM Jagan: సీఎం క్లాస్ పీకిన ఆ 27 మంది ఎవరు? నలుగురు మంత్రలు, మాజీ మంత్రులు కూడా..

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఏపీ సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

CM Jagan Mohan Reddy: నలుగురు మంత్రులు.. మాజీ మంత్రులు.. ఎమ్మెల్యే మొత్తం 27 మందికి సీఎం జగన్ క్లాస్ పీకారా..? అందులో జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారా..? ఇంతకీ ఎవరా మంత్రులు..? ఎందుకు క్లాస్ పీకారు..

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  CM Jagan Mohan Reddy On Leaders: ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ.. మంత్రులు, మాజీ మంత్రులు సహా 27 మంది నేతలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అమరావతి (Amaravati)లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapaku Mana Government) కార్యక్రమంపై సీఎం జగన్ం అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో గతంలో ఎప్పుడు లేని విధంగా నేతల పని తీరుపై అధినేత నిప్పులు చెరిగినట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం జగన్ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గడప గడపకు కార్యక్రమం విషయంలో కొందరు నేతలు వ్యవహరించిన తరు.. అస్సలు బాగులేదని.. పద్దతి మార్చుకోకుంటే.. వచ్చే ఎన్నికల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించినట్టు టాక్. మనం వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు నెగ్గాలి అంటే.. తనతో పాటు.. అందరూ కష్ట పడాలి అని.. కానీ ఇలా కాలయాపన చేస్తే.. ఫలితం రాదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

  గతంలో చెప్పిన కొందరు తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 27 మంది పేర్లతో సహా జగన్ ప్రస్తావించారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవంబర్ లో మళ్లీ సమీక్ష ఉంటుందని అప్పటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే ఎన్నికలకు ఆరు నెలల ముందు చివరి సమీక్ష ఉంటుందని.. అప్పుడు మీ ప్రదర్శన ఆధారంగానే టికెట్లు కేటాయించడం జరుగుతుందని క్లారిటి ఇచ్చారంటున్నారు.

  గడప గడపకు ప్రభుత్వం నెలకు 16 రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గతంలోనే చెప్పినా ఆ పని చేయడం లేదని సీఎం జగన్ మండిపడ్డారు. తక్షణమే ఈ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనాలని.. వాళ్ల కుటుంబ సభ్యులు పాల్గొంటే పరిగణించలేమని సీఎం జగన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

  ఇదీ చదవండి : ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  ఈ జాబితాలో నలుగురు మంత్రులు ఉన్నారని.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, రోజా సెల్వమణి ఉన్నారని సమాచారం అందుతోంది. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆళ్ల నాని , కొడాలి నాని పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

  ఇదీ చదవండి : రైల్వే జోన్ పై వదంతులు నమ్మొద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

  సీఎం జగన్ క్లాస్ పీకిన ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గ్రంధి శ్రీనివాస్, శిల్పాచక్రపాణి రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, ధనలక్ష్మీ ఉన్నారని తెలుస్తోంది. అయితే  70 రోజుల్లో 15 రోజులు కంటే తక్కువ కాలం తిరగడం సమంజసం కాదని సీఎం జగన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Kodali Nani, Minister Roja, Ycp

  ఉత్తమ కథలు