CM jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విపక్షాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) మరోసారి ఛాలెంజ్ విసిరారు.. తమ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని విపక్షాలు భావిస్తే.. పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాయని ప్రశ్నించారు.. నిజంగా ప్రతిపక్ష పార్టీలకు (Opposition Paries) దమ్ము ధైర్యం ఉంటే.. సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయండి అంటూ ఛాలెంజ్ చేశారు.. ప్రస్తుతం మనం రాజకీయ కుట్రలతో పోటీ పడుతున్నామన్నారు.. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తుంచుకొని ఓట్లు వేయాలి అని కోరారు.. మంచి చేస్తున్న ప్రభుత్వానికి.. కుట్రలు చేసే దుష్టచతుష్టయానికి వచ్చే ఎన్నికల్లో పోటీ జరుగుతుంది అన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించి మంచి మనసును దీవించాలని జగన్ కోరారు..
మనం పేద ప్రజలకు మంచి చేస్తున్నా.. ప్రస్తుతం విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
జగనన్న విద్యా దీవెన కింద సీఎం జగన్.. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనది డీబీటీ అయితే వాళ్లది డీపీటీ అని విమర్శించారు. అంటే మన ప్రభుత్వంలో డీబీటీ అంటే.. డైరెక్ట్ బెన్‌ఫిట్ ట్రాన్స్‌ఫర్.. గత ప్రభుత్వంలో డీబీటీ అంటే.. దోచుకో, పంచుకో, తినుకో అనే విధానం కొనసాగింది అన్నారు.
ఇదీ చదవండి : పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితం వివాదం.. కేంద్ర ఎన్నికల సంఘ సీరియస్
ప్రతి సినిమాల్లోనూ హీరోలతో పాటు విలన్లు కూడా ఉంటారని.. అయితే సినిమాల్లో ప్రజలకు నచ్చేది హీరోలే అన్నారు.. విలన్‌లు కాదని అన్నారు. ఎక్కడైనా చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడని.. గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. గతంతో పోలిస్తే ఈ బిడ్డ ప్రభుత్వంలో అప్పులు తక్కువ ఉన్నాయి.. పేదలకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం.. గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీకి షాక్ తప్పదా..? టీడీపీ విప్ జారీ.. అసలు వ్యూహం ఇదే
అయితే సీఎం వ్యాఖ్యలకు.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్షాలు అంతా కలిస్తే.. ఇలాంటి ఫలితాలు వస్తాయనే అనుమానిస్తున్నారని.. అందుకే పొత్తుల గురించి సవాల్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిజంగా సీఎం జగన్ చెప్పినట్టు అందరికీ మంచే చెస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Vijayawada