హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అది మా హక్కు, బాధ్యత..! స్పష్టం చేసిన సీఎం

YS Jagan: మూడు రాజధానులపై తగ్గేదేలే..! అది మా హక్కు, బాధ్యత..! స్పష్టం చేసిన సీఎం

అసెంబ్లీలో సీఎం జగన్

అసెంబ్లీలో సీఎం జగన్

మూడు రాజధానుల (Three Capitals) పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ తమ విధానమని.. హక్కు అని క్లారిటీ ఇచ్చారు.

  మూడు రాజధానుల (Three Capitals) పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ తమ విధానమని.. హక్కు అని క్లారిటీ ఇచ్చారు. సాధ్యం కానివి సాధ్యం చేయాలని హైకోర్టు చెప్పడం సరికాదన్న సీఎం జగన్.. తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకోవడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడతామని.. వారికి అండగా నిలుస్తామని చెప్పారు. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ అర్ధం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆత్మగౌరవం, అందరి ప్రయోజనం ఉంది కాబట్టి ముందుకెళ్తామన్నారు.

  రాజధాని విషయంలో శాసన సభకు సర్వాధికారాలున్నాయని.. భవిష్యత్తు తరాల క్షేమం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. వికేంద్రీకరణ అవసరం ఉంది కాబట్టి.. న్యాయవస్థపై విశ్వాసం ఉందని ప్రకటిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. వికేంద్రీకరణే మా విధానమని.. రాజధానిపై నిర్ణయం తమ హక్కు, తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

  ఇది చదవండి: హైకోర్టు తన పరిధిని దాటింది.. రాజధానుల తీర్పుపై జగన్ సంచలన కామెంట్స్


  అదెలా సాధ్యం..?

  ఆరు నెలల్లో రోడ్లు, భవనాలన్ని నిర్మించాలని ఆదేశించడం సరికాదన్నారు. 20 ఏళ్లలో అమలు సాధ్యం కాని ఆదేశాలివ్వడమేంటని అన్నారు. అలాగే రాజధాని మాస్టర్ ప్లాన్ కేవలం పేపర్లోనే ఉందని.. గ్రాఫిక్స్ కే పరిమితమైందని జగన్ అభిప్రాయపడ్డారు. రోడ్లు, డ్రెయినేజీలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేని ప్రాంతంలో వీటి కోసమే రూ.54వేల ఎకరాలు ఒక్కో ఎకరం రూ.2కోట్ల చొప్పున రూ.1.09లక్షల కోట్ల అంచనా వేశారన్నారు. రాజధాని నిర్మాణానికి కనీసం 40 ఏళ్లు పడుతుందన్న జగన్.. అభివృద్ధి చెందిన నగరాలన్నీ కొన్ని దశాబ్దాల్లో ఆ స్థితికి వచ్చాయని చెప్పారు.

  ఇది చదవండి: మహిళలకు వైసీపీ ప్రభుత్వం చేసింది ఇదే.. అసెంబ్లీలో లెక్కలు చెప్పిన మంత్రి.. ఈ పథకాలే హైలెట్..


  చంద్రబాబు హయాంలో రాజధానిపై 2016-19 మధ్య రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఈ ప్రాంతంపై నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్నారు. అందుకే ఇక్కడే శాసన రాజధాని ఉండాలని కోర్కుంటున్నానన్నారు. ఆరేళ్ల క్రితం లక్ష కోట్లుగా ఉన్న ఖర్చులు.. భవిష్యత్తులో ఇది రూ.15-20 లక్షల కోట్లు అవుతుంది పేర్కొన్నారు. అసలు ఇది సాధ్యమా కాదా అనేది ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అంశాలపై భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఓట్ల కోసం అలా చేస్తే నాయకులు కాలేరని సీఎం అభిప్రాయపడ్డారు.

  ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలా..? ఐతే ఈ కోడ్ ఎంటర్ చేయండి.. వైసీపీ నేతపై ట్రోలింగ్..


  చంద్రబాబుకు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే రాజధానిని విజయవాడ లేదా గుంటూరులో పెట్టి ఉండేవారని చెప్పారు. అలా కాకుండా రెండు నగరాలకు దూరంగా తన బినామీల కోసం రాజధానిని నిర్ణయించారని విమర్శించారు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటే 500 ఎకరాల్లో రాజధాని నిర్మించేవారని జగన్ అన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Ap capital, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు