Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN KEY DECISION HE ANNOUNCED NEWS DISTRICT IN CHARGES VIDUDALA RAJANI FOR VISAKHAPATNAM NGS

AP Minsters: సీఎం జగన్ కీలక ప్రకటన.. విశాఖకు విడుదల రజని.. ఏ జిల్లాలకు ఎవరు ఇన్ ఛార్జ్ ?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

AP Minsters: సీఎం జగన్ దూకుడుగా దూసుకుపోతున్నారు. 2024 ఎన్నికల్లో భాగంగా ముందస్తు వ్యూహాలతో జెట్ స్పీడ్ వేగంతో పార్టీ పటిష్టతపై ఫోకస్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు.. మంత్రి వర్గ విస్తరణ వెంట వెంటనే పూర్తి చేసిన ఆయన.. ఆవెంటనే మంత్రులకు శాఖలు కేటాయించడంతో పాటు.. ఇప్పుడు జిల్లాల ఇన్ ఛార్జుల బాధ్యతలు అప్పచెప్పారు. ఇక రీజనల్ ఇంచార్జులపై ఫోకస్ చేయనున్నారు.

ఇంకా చదవండి ...
    AP Minsters: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇకపై పూర్తిగా పార్టీ పటిష్టత కోసం ఎక్కువ సమయం కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల్లో రెండేళ్లే సమయం ఉండడంతో.. ఆలస్యం చేయకుండా దూకుడుగా దూసుకుపోయే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి.. పాలన కూడా ప్రారంభించారు. ఆ వెంటనే కొత్త కేబినెట్ పేరుతో ఎన్నికల టీంను సిద్ధం చేసుకున్నారు. కేబినెట్ కూర్పుపై ఎన్ని విమర్శలు వచ్చినా.. అసమ్మతి గళం పెరుగతున్నా.. తనపని తాను చేసుకుపోతున్నారు.. ఇప్పటికే మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. ముగ్గురు నలుగురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పులు చేయలేదు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో కొత్త కేబినెట్ విస్తరించిన ఆయన.. ఆ 25 మందిని 25 జిల్లాలకు ఇంఛార్జులుగా నియమించారు.. మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.

    2024 ఎన్నికలే టార్గెట్‌గా మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీలు అయిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముందునుంచి చెబుతున్నట్టే.. మాజీ మంత్రులను ముఖ్యమైన జిల్లాల్లో రీజనల్‌ కోఆర్డినేటర్లుగా నియమించబోతున్నారు. పార్టీని ముందుండి నడిపించే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు, ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకోవడం, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లడం వంటి పనులను ఆ కోర్డినేటర్లకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రీజనల్‌ కో ఆర్డినేటర్లతో పాటు.. కొత్తగా ఏర్పాటు అయిన 25 జిల్లాలకు కూడా పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు.

    ఇదీ చదవండి : సర్ ప్రైజ్ అంటూ యువకుడి గొంతుకోసిన ఘటనలో ట్విస్ట్.. అచ్చం దేశముదురు సినిమాలాగే..?

    అందర్నీ కలుపుకుంటూ రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా బొత్స సత్యనారాయణ, అనకాపల్లి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.రాజన్నదొర, కాకినాడ ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా సిదిరి అప్పలరాజు, పార్వతిపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రిగా గుడివాడ అమర్నాధ్, పశ్చిమగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా దాడిశెట్టి రాజా, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా పి.విశ్వరూప్‌ నియామకం అయ్యారు. తూర్పుగోదావరి ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా తానేటి వనిత, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు, బాపట్ల జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా కొట్టు సత్యనారాయణ, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా రోజా, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా అంబటి రాంబాబు, కడప ఆదిమూలపు సురేశ్ కు బాధ్యతలు అప్పగించారు.

    ఇదీ చదవండి : వైసీపీ అసంతృప్తులకు సీఎం జగన్ బుజ్జగింపులు.. ఆ ఇద్దరు నేతలకు కీలక పదవులు

    జిల్లాల‌కు ఇన్‌చార్జి మంత్రులు వీరే..
    శ్రీ‌కాకుళం – బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
    విజ‌య‌న‌గ‌రం – ముత్యాల నాయుడు
    విశాఖ‌ప‌ట్నం – విడుద‌ల ర‌జ‌ని
    అన‌కాప‌ల్లి – రాజ‌న్న దొర‌
    అల్లూరి సీతారామ‌రాజు – గుడివాడ అమ‌ర్‌నాథ్‌
    తూర్పు గోదావ‌రి – చెన్నుబోయిన వేణు
    కాకినాడ – సిదిరి అప్ప‌ల‌రాజు
    అమ‌లాపురం – జోగి ర‌మేష్‌
    ప‌శ్చిమ గోదావ‌రి – దాడిశెట్టి రాజా
    ఏలూరు – విశ్వ‌రూప్‌
    ఎన్టీఆర్ జిల్లా – తానేటి వ‌నిత‌
    కృష్ణాజిల్లా – రోజా
    ప‌ల్నాడు జిల్లా – కారుమూరి నాగేశ్వ‌ర‌రావు
    బాప‌ట్ల – కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌
    గుంటూరు – ధ‌ర్నాన ప్ర‌సాద‌రావు
    ఒంగోలు – మేరుగ నాగార్జున‌
    నెల్లూరు – అంబ‌టి రాంబాబు
    అనంత‌పురం – పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
    స‌త్య‌సాయి జిల్లా – గుమ్మ‌నూరి జ‌య‌రామ్‌
    క‌ర్నూలు – బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి
    నంధ్యాల – అంజాద్ బాషా
    తిరుప‌తి – నారాయ‌ణ‌స్వామి
    అన్న‌మ‌య్య జిల్లా – కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి
    చిత్తూరు – ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌
    క‌డ‌ప – ఆదిమూలపు సురేష్‌
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Rk roja, Vidadala Rajani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు