సీఎం జగన్ వైఎస్ జగన్ దూకుడు పెంచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాలపై ఆయన ఫోకస్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే మరికాసేపట్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ కాబోతున్నారు. గత ఎన్నికల్లో విశాఖలోని 4 స్థానాల్లో వైసిపి బోణీ కొట్టలేదు. ఆ నాలుగు స్థానాల్లో టీడీపీనే గెలిచింది. అయితే ఈసారి మాత్రం విశాఖలో అన్ని స్థానాల్లో గెలవాలని జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మరో 19 నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ 175కి 175 స్థానాలను ఎట్టి పరిస్థితిలోను జెండా పాతాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగా కార్యకర్తలతో సమావేశాన్ని స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. ఇటీవల అద్దంకి, ఆలూరులో కూడా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఇప్పటి నుంచి వేసే ప్రతి అడుగు ఎన్నికల దిశగానే ఉండాలని ఆ సమావేశాల్లో జగన్ చెప్పినట్లు తెలుస్తుంది. అందరం కలిసి కట్టుగా పని చేస్తే 175 సీట్లు సాధించడం పెద్ద కష్టమేమి కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. గడిచిన మూడు ఏళ్లలో అద్దంకి, ఆలూరు నియోజకవర్గాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
పార్టీ నేతలను ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్నారు సీఎం జగన్. గడప గడపకు ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అక్కడితోనే ఆగలేదు.. ఆ ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది..? వారికి జనాల్లో ఉండే పలుకబడి ఏంటి అంటూ.. క్షేత్రా స్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సర్వేలో వారికి వచ్చిన ప్రోగ్రస్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయించనున్నారు సీఎం. గతంలోనే దాదాపు 25కు పైగా నేతలకు సీఎం జగన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందులో మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి డిసెంబర్ నెల వరకే గుడువు ఇచ్చారు. ఇప్పుడు అధినేత ఇచ్చిన గడువు సమీపిస్తుండడం ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. అధినేత దగ్గర తమ జాతకం ఎలా ఉందా అని ఆరా తీసే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. అభ్యర్థులను డిసైడ్ చేసేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని గతంలో చెప్పారు కూడా.. దీంతో ఈ డిసెంబర్ లో జరగబోయే సమావేశంలోనే.. ఎవరెవరికి టికెట్లు ఇచ్చేది లేదో తేల్చి చెప్పే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, AP News, Visakhapatnam