Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN GAVE KEY POSTS WHO DONT GET IN CABINET BERTH LIKE KODALI NANI NGS GNT

AP Cabinet Update: ఆ నాలుగు వర్గాలకు దక్కని చోటు.. కొడాలి నానికి కీ పోస్ట్.. డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

AP Cabinet Update: సామాజిక లెక్కలతోనే ఏపీ కేబినెట్ పైనల్ జాబితా తయారు చేశారు సీఎం జగన్.. ముఖ్యంగా బీసీ, ఎస్సీలకు పెద్ద పీట వేశారు. మహిళలకు అవకాశం కల్పించారు. కానీ ఆ నాలుగు వర్గాలకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో వారికి ఆయా పదవులు కల్పించారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Amaravathi , News18.

  AP Cabinet Update:  2024 ఎన్నికలే లక్ష్యంగా కొత్త కేబినెట్ (AP New Cabinet) కూర్పు ఫైనల్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ముఖ్యంగా సామాజిక,  రాజకీయ లెక్కలతోనే కూర్పు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తొలి కేబినెట్ లో పని చేసిన పది మందికి మరో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ సారి నలుగురు మహిళలకు మంత్రి వర్గం అవకాశం కల్పించారు.  జిల్లాల వారిగా చూసుకుంటే తూర్పు గోదావరి (East Godavari), పశ్చిమ గోదావరి (West Godavari), గుంటూరు జిల్లా (Gunturu Disrtrict)ల్లో ముగ్గురు చొప్పున అవకాశం కల్పించారు. ఇక కృష్ణా జిల్లా (Krishna District) నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు..  సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే..  బీసీకి 10, కాపు వర్గానికి 4, రెడ్డి వర్గానికి 4, ఎస్సీ వర్గానికి 5, ఎస్టీ వర్గాని ఒకటి,   మైనార్టీ వర్గాని ఒకటి చొప్పుడ కేటినెట్ లో చోటు ఇచ్చారు.  అయితే ఇందులో బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, కమ్మ  కులాలకు చెందిన ఒక్కరి కూడా జగన్ అవకాశం కల్పించలేదు.

  ప్రస్తుతం కేబినెట్ లో అవకాశం దక్కని ఆ నాలుగు కులాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో.. ఆయా వర్గాలకు చెందిన వారికి కీలక పదవులు కేటాయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నానికి కీలక పదవి ఇవ్వాలని అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి పదవులను ఆర్యవైశ్య, క్షత్రియ వర్గాలకు కేటాయించాలని భావిస్తున్నారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కొత్త కేబినెట్ ఇదే.. వారికే ఈ సారి అధిక ప్రాధాన్యం.. వాళ్లకు తప్పని నిరాశ

  ఇందులో భాగంగా..  చీఫ్ విప్ గా ప్రసాద రాజుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే  డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్ర స్వామిని ఎంపిక చేస్తారని సమాచారం. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ..  దానికి కొడాలి నాని చైర్మన్ గా నియమిస్తారని తెలుస్తోంది. అలాగే  ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా మల్లాది విష్ణుకు అవకాశం కల్పిస్తారని వైసీపీ వర్గాల టాక్..

  ఇదీ చదవండి : వైసీపీలో అసమ్మతి జ్వాల.. స్పృహ త‌ప్పి పడిపోయిన బాలినేని.. రాజీనామాకు సై అంటున్న నేతలు

  25 మందితో కూడిన తుది మంత్రుల జాబితా ఇదే..
  1.సీదిరి అప్పలరాజు(పలాస)
  2. ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం)
  3.పి.రాజన్న దొర(సాలూరు)
  4. బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి)
  5. గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి)
  6.బూడి ముత్యాలనాయుడు(మాడుగుల)
  7.దాడిశెట్టి రాజా(తుని)
  8.పినిపే విశ్వరూప్(అమలాపురం)
  9.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(రామచంద్రాపురం)
  10. తానేటి వనతి(కొవ్వూరు)
  11.కారుమూరి నాగేశ్వరరావు(తణుకు)
  12.కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం)
  13. జోగి రమేష్(పెడన)
  14.అంబటి రాంబాబు(సత్తెనపల్లి)
  15. అంజద్ భాషా(కడప)
  16.మేరుగు నాగార్జున(వేమూరు)
  17.విడదల రజనీ(చిలకలూరిపేట)
  18. కాకాణి గోవర్ధన్రెడ్డి(సర్వేపల్లి)
  19.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు)
  20.ఆర్కె రోజా(నగరి)
  21. ఉషశ్రీ చరణ్(రాయదుర్గం)
  22. తిప్పేస్వామి(మడకశిర)
  23. నారాయణస్వామి(గంగాధర నెల్లూరు)
  24.గుమ్మనూరు జయరాం(ఆలూరు)
  25. బుగ్గన రాజేంద్రనాథ్(డోన్) 

  తాజా కేబినెట్ కూర్పు చూస్తుంటే కొన్ని వర్గాల నుంచి నిరసన సెగలు తప్పేట్టు లేదు. అలాగే మంత్రి పదవులు దక్కని వారు తీవ్ర అసహనంతో ఉన్నారని సమచారం. నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం తన పేరును పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకాణిని వైసీపీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోవాలని అంటున్నారు ఆయన వర్గీయులు. ఇటు
  మాచర్ల, చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు బయట పడ్డాయి. పిన్నెల్లి పేరు లేదంటూ ఆయన అనుచరులు రాజీనామాలకు సిద్దమయ్యారు. అలాగే విడుదల రజనీకి ఇవ్వొద్దంటూ ఆమె వ్యతిరేక వర్గాలు ఆందోళనకు దిగాయి. ఇటు సీనియర్ నేత బాలినాని సైతం తనకు మంత్రి పదవి కొనసాగించకపోవడంపై అలకపూనారు..
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు