CM Jagan Focus on Rajya sabha Elections: అధికార పార్టీలో మళ్లీ ఎన్నికల కోలహాలం మొదలైంది. ఇప్పటికే ఆశావాహులంతా అధిష్టానం చూపు తమపై పడేలా చేసుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్నవి నాలుగు సీట్లు అయినా.. అందరూ పోటీ పడుతున్నది కేవలం ఒక్కసీటు కోసం మాత్రమే అనే ప్రచారం ఉంది. దీంతో ఆ ఒక్క సీటు ఎవరిది అన్నది తీవ్ర ఉత్యంఠ రేపుతోంది. ఇప్పటికే ఏపీలో రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ బరిలో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి మొత్త నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), సురేశ్ ప్రభు (Suresh Prabhu), టీజీ వెంకటేశ్ (TG Venkatesh), సుజనా చౌదరి (Sujana Chowdari)ల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే అన్ని సీట్లు కేవలం వైసీపీకే దక్కనున్నాయి. దీంతో ఆ నాలుగు సీట్లు ఎవరికి ఇవ్వాలి అన్నదానిపై ఇప్పటికే అధినేత జగన్.. ఒక నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం ఉంది.
ముఖ్యంగా ఒకటి.. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి.. అంటే ఆయన భార్య లేదా కుమారుడిలో ఒకరికి ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక రెండోది.. మెగా ప్రొడ్యూసర్.. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డికి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. విజసాయి రెడ్డిని కొనసాగించి.. నాలుగో స్థానాన్ని మైనార్టీ లేదా దళిత వర్గానికి ఇవ్వాలని జగన్ యోచించినట్లు సమాచారం.. విజయసాయిని కేవలం పార్టీ కోసం వాడుకోవాలి అని నిర్ణయం తీసుకుంటే.. ఆ సీటు కోసం ఆశావాహుల సంఖ్య మరింత పెరగనుంది.
ఇదీ చదవండి: పెళ్లింట విషాదంలో సంచలనం.. పెళ్లికూతురు గన్నేరుపప్పు తిందా..? ఎందుకంటే..?
ఇప్పటికే రాజ్యసభ సీటు కోసం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే, మైనార్టీ నుంచి సినీ నటుడు అలీ, ఇక్బాల్ పేర్లు వినపడుతున్నాయి. మొత్తం రాజ్యసభలో త్వరలో 57 స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు ఆయా రాజ్యసభ సీట్ల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న విడుదల చేయనుంది.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ పై క్లారిటీ ఇచ్చినా మంత్రి పెద్దిరెడ్డి.. ఎవరి ఫోన్ ట్రాక్ చేశారంటే?
ఏపీ శాసనసభలో వైసీపీకి ఉన్న సంఖ్యా బలంతో నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 1న పరిశీలన ఉంటుంది. జూన్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు సమయంగా ఇస్తారు. నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనుండటంతో..ఆ నలుగురిలో ప్రస్తుత సభ్యుడిగా ఉన్న విజయ సాయిరెడ్డికి రెన్యువల్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ లెక్కన మిగిలింది కేవలం ఒక్క సీటు మాత్రమే.. గతంలో రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీదా మస్తాన రావుకు రాజ్యసభ సీటు ఖరారు అయినట్లు ప్రచారం ఉంది. అలా అయితే విజయసాయి రెడ్డి.. లేదా మరో ముస్లి, మైనార్టీ వర్గాలను పక్కన పెట్టే అవకాశం ఉంది.. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Vijayasai reddy