Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN DELHI TOUR UPDATE HE MEETS CENTRAL MINSTER MANDAVIA AND ASKING 13 MEDICAL COLLEGES NGS

CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 13 మెడికల్ కాలేజీలు మంజూరు.. ఢిల్లీ టూర్ లో సీఎం జగన్

ఏపీకి 13 మెడికల్ కాలేజ్

ఏపీకి 13 మెడికల్ కాలేజ్

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ను మెడికల్ హబ్ గా చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా ఏపీ దాటి వెళ్లకూడదన్నది సీఎం ఉద్దేశం.. తాజాగా ఢిల్లీ టూర్ లోనూ కేంద్రాన్ని కోరాడు ఏపీ సీఎం.. మరి కేంద్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇంకా చదవండి ...
    CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను మెడికల్ హబ్ (Medical Hub) గా మార్చడమే తన లక్ష్యం అని సీఎం జగన్ (CM Jagan) పదే పదే చెబుతూ వస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్యసదుపాయాల కొరత ఏర్పడిందని సీఎం జగన్ వివరించారు. ఇందుకోసం హైదరాబాద్ (Hyderabad), బెంగుళూరు (Bangalore), చెన్నై (Chennai) నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఏపీలో 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి మాండవీయను సీఎం జగన్ కోరారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయాను కలిశారు. దాదాపు అరగంటపాటు సాగిన భేటీలో పలు విజ్ఞప్తులు అందజేశారు. రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటు చేసినందున ప్రతి జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ (Medical College) ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. పీహెచ్‌సీలు, యుపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రస్తుతం ఉన్న బోధనాసుపత్రులను, నర్సింగ్‌ కాలేజీలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలకు ఒక వైద్యకళాశాల ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

    శనివారం ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనూ సీఎం జగన్ పాల్గొన్నారు. ఆ తరువాత కేంద్రమంత్రిని కలిశారు. ఏపీలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ఇదివరకే 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్‌ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే కొత్త జిల్లాలను పరిగణలోకి తీసుకుని మిగిలిన 12 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. 2023 డిసెంబర్‌ నాటికి ఈ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేస్తామని.. 2024 అడ్మిషన్లకు సిద్ధం చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

    ఇదీ చదవండి : బొత్స కరెంట్ బిల్లు కట్టలేదా? విద్యుత్ శాఖ ఏమంటోంది? మంత్రి వివరణ ఇదే

    అలాగే సీఎం జగన్ మంగళవారం ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పలువురి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర పెద్దలను ఆయన కోరనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ నిధుల మంజూరు అంశాన్ని సీఎం ప్రస్తావించనున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పోలవరం అంశాన్ని ప్రధాని మోడీ, జల్‌శక్తి మంత్రి షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. పోలవరం పనులను వేగవంతం చేసేలా చూడాలని ఇప్పటికే ఆర్థిక, ఇతర శాఖలను కేంద్రం ఆదేశించింది. ఇటీవల జరిగిన అపెక్స్‌ సమావేశంలో కీలక ఆదేశాలు సైతం ఇచ్చింది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు