Home /News /andhra-pradesh /

AP POLITICS CM JAGAN DECIDED TO MORE RESPONSIBLE FOR PARTY AND MAIN KEY PERSON TO ATTACK ON TDP NGS

Kodali Nani: మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు అధినేత క్లారిటీ..? చంద్రబాబుపై మరో బాణం

కొడాలి నాని (ఫైల్)

కొడాలి నాని (ఫైల్)

Kodali Nani: ప్రస్తుతం జగన్ కేబినెట్ లో కీలక మంత్రుల్లో కొడాలి నాని ఒకరు. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలి అన్నా.. ప్రత్యర్థులను చడుగుడు ఆడాలన్న మంత్రుల్లో ముందుగా కనిపించేది కొడాలి నాని మాత్రమే. అందుకే ఆయన్ను మంత్రిగా కొనసాగిస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన్న తప్పిస్తున్నట్టు అధినేత క్లారిటీ ఇచ్చారా..? తరువాత కొడాలికి ఎలాంటి బాధ్యతలు అప్పగించనున్నారు..?

ఇంకా చదవండి ...
  Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కేబినెట్ లో ఎందరు మంత్రులు ఉన్నా.. అందులో కొడాలి నాని (Kodali Nani)ది ప్రత్యేక గుర్తింపు.. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)ని.. ప్రతి పక్ష నేత చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) లను ఆటాడుకోవడంలో కొడాలి నాని ముందు ఉంటారు. ప్రభుత్వం నుంచి గట్టిగా వాయిస్ వినిపించాలి అంటే ముందుగా గుర్తు వచ్చేది కొడాలి నాని మాత్రమే. అందుకే ఆయన్ను ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రిగా కొనసాగిస్తారు అంటూ మొదట ప్రచారం జరిగింది.  కానీ సామాజిక, రాజకీయ కారణాల నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan).. కొడాలి విషయంలో మనసు మార్చుకున్న్టట్టు సమాచారం. అయితే సీఎం జగన్ ఓపెన్ గా చెప్పకపోయినా.. తన మంత్రి పదవి విషయంలో ఏం జరగనుందనే అంచనాకు మంత్రి వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాను వారం రోజుల్లో ఫ్రీ అయిపోతానని..అప్పుడు తన విశ్వరూపం ఏంటో చూపిస్తానంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో.. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే క్లారిటీ వచ్చేసింది.

  స్వయంగా కొడాలి నాని వ్యాఖ్యలే ఆ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేలా చేశాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలు వైసీపీతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పదవి తనకు ఒక లెక్క కాదని చెప్పుకొచ్చారు. తాను బతికి ఉన్నంత కాలం జగన్ తోనే నడుస్తానని స్పష్టం చేసారు. తనకు సీఎం జగన్ మంత్రి పదవి ఇవ్వటంతో బాధ్యతగా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పారు. మరో వారంలో ఫ్రీ బర్డ్ అవుతానని.. అప్పుడు చంద్రబాబు సంగతి చూస్తానంటూ వ్యాఖ్యానించారు. టీడీపీకి చుక్కలు చూపించడమే తరువాత అంటూ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుడివాడలో వరుసగా నాలుగు సార్లు గెలిచానని చెబుతూ.. 2024 లో మరోసారి ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

  ఇదీ చదవండి : ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్.. అదే రోజు విందు.. మంత్రుల రాజీనామా..?

  చంద్రబాబుపై జగన్ విసిరే బాణం..
  కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణం అందేనంటూ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు పార్టీ పరంగా టీడీపీ ప్రభావిత జిల్లాల బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ప్రధానంగా ఆయనకు కృష్ణా - గుంటూరు జిల్లాల రీజనల్ బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఆయన ముందుకు సాగనున్నారు. అంతేకాదు.. చంద్రబాబుకు అండగా నిలుస్తున్న కమ్మ సామాజిక వర్గ ఓట్లను చీల్చచడమే లక్ష్యంగా కొడాలి నానిని ఉపయోగిస్తారనే ప్రచారం ఉంది. దానికి తోడు నందమూరి కుటుంబంతో నానికి సన్నిహిత సంబంధం ఉంది.  విజయాడకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు.. వీటన్నింటినీ ఆయుధంగా చూపించి.. నందమూరి కుటుంబానికి చంద్రబాబును కాస్త దూరం చేసినా.. వైసీపీ అడ్వాంటేజ్ అవుతుంది. ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తరువాత.. మంత్రి కొడాలి నానికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

  ఇదీ చదవండి : జనసేనాని పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ ..? మరి పవన్ చరిత్రను తిరగరాస్తారా..? చతికిలపడతారా?

  కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పిస్తే.. ఆయన ప్లేస్ లో ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపైనా చర్చ జరుగుతోంది. ఆ జిల్లా నుంచి వసంత కృష్ణ ప్రసాద్.. ఎమ్మెల్సీ తలశిల రఘురాం రేసులో ప్రముఖంగా ఉన్నారు. అలాగే పశ్చిమ గోదావరి నుంచి అబ్బయ్య చౌదరి పేరు వినిపిస్తోంది. కమ్మ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, ఎవరి పేరు సీఎం ఎంపిక చేస్తారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైన ఏప్రిల్ 7న జరిగే కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు