Next Elctions: ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో.. ఇటు తెలంగాణ (Telangana) లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సై అంటూ సమర శంఖం పూరిస్తున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం.. ఏపీలో 2024లో.. తెలంగాణలో 2023లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది.. కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీ విషయానికి వస్తే.. ఎన్నికలకు కేవలం మరో 16 నెలల సమయం ఉందని పార్టీ నేతలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) చెబుతున్నారు. ఇంకా సమయం ఉందని.. నిర్లక్ష్యంగా ఉండొద్దని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఇప్పుడే ఎన్నికలు అన్నట్టు పని చేయాలి అని పిలుపు ఇచ్చారు.
మొదట కొన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమైన జగన్ 18 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి అన్నారు. కానీ నెల రోజుల వ్యవధిలో మరికొన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సీఎం.. ఎన్నికలకు మరో 16 నెలలు మాత్రమే సమయం ఉంది అన్నారు. తాజా పరిస్థితులను చూస్తే.. ఎన్నికలు ఏడాది లోపే వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. వచ్చే ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉంది..? కానీ జగన్ రెండు నెలలు తగ్గించుకుని కార్యకర్తలకు చెబుతున్నారు. దీంతో జగన్ కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారన్న అంశంపై ఆ పార్టీ నేతలకు క్లారిటీ వస్తోంది. అయితే అక్కడితోనే జగన్ ఆగలేదు. అధికారులను సైతం ఎన్నికల నేపథ్యంలోనే బదిలీలు చేస్తున్నారని.. కీలక వ్యక్తులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారని ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : గిరిజనులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
అయితే ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా..?తెలంగాణతో పాటు జరగాలని జగన్ కోరుకుంటున్నారని తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా వచ్చినా.. దానికి తగ్గట్లుగా వ్యూహాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నది జగన్ లెక్క అంటున్నారు. అందుకే ఇటీవల అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది. త్వరలో పాలన వ్యవస్థలోనూ ఇలాంటి బదిలీలు చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. విద్యాదీవెన నగదు జమ ఎప్పుడంటే?
సాధరణంగా అయితే ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇలాంటి బదిలీలు చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడే చేసేస్తోంది. తెలంగాణ అసెంబ్లీతో పాటు ఎన్నికలకు వెళ్తే ప్రయోజనాలు ఉంటాయని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీ , జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే సమస్య ఎదురుకావొచ్చు. కానీ అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు ఉంటే బీజేపీ మొత్తం ఫోకస్ తెలంగాణపైనే ఉంటుంది. ఇటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాుబ సైతం.. తెలంగాణపై కొంత పోకస్ చేయాల్సి ఉంటుంది. అది తనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అలాంటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకరు..? ఆయనపై బాలయ్యకు అంత ప్రేమకు కారణం అదేనా?
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో జగన్‌కు బయటకు కనిపించని అనుబంధం ఉంది. అది ఎన్నో సార్లు బయటపడింది. రెండుపార్టీల మధ్య మంచి అవగాహన ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే బీజేపీతో కేసీఆర్ నేరుగా యుద్ధం ప్రకటించారు.. వైసీపీ మాత్రం ఆ పార్టీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తోంది. ఈ రెండు భిన్న దారుల వల్ల వారు తమ అవగాహనను బయట పెట్టుకోలేకపోతున్నారు. అయితే అంతర్గత సంప్రదింపుల ద్వారా ఒకే సారి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. తెలంగాణతో పాటే ఎన్నికలు… ఇదే గేమ్ ప్లాన్ ! కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. పది నెలల్లో ఎన్నికలని కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో వైసీపీ కూడా విడిగా ఎన్నికలకు వెళ్లడం కన్నా..కలిసి వెళ్లడమే మంచిదని భావిస్తున్నారు. పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోయినా ఎన్నికలు మరో ఏడాదిలో జరగాల్సి ఉంది. ఏపీలో మాత్రం ఏడాదిన్నరలో జరగాల్సి ఉంది. ఎప్పుడు జరిగినా రెండూ ఒకే సారి జరగడం మాత్రం ఖాయమనుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, CM KCR